ఆర్సీబీ ఫ్యాన్స్ కి కొత్త భయం పట్టుకుంది. కప్ కోసం గత పదిహేనేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో 15 ఇయర్స్ వెయిటింగ్ తప్పేలా లేదని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
ఆర్సీబీ అలియాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ జట్టు గురించి చెప్పుకుంటే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్ తో బరిలోకి దిగడం, మొండిచేత్తో బయటకెళ్లిపోవడం. గత 15 ఏళ్లుగా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. మూడుసార్లు ఫైనల్స్ లో అడుగుపెట్టింది. కానీ అదృష్టం లేకుండా పోయింది. స్టార్ ప్లేయర్స్ ఉన్నాసరే ఐపీఎల్ ట్రోఫీ అందన ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఈ జట్టు ఫ్యాన్స్ కి మరో భయం పట్టుకుంది. ఈ థియరీ బట్టి చూస్తే.. మరో 15 ఏళ్లు కప్ కొట్టడం కష్టమే అనిపిస్తుంది.
అసలు విషయానికొస్తే.. ఆర్సీబీ జట్టుని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా బలంగా ఉండేది. మొదట్లో కుంబ్లే, ద్రవిడ్ లాంటి స్టార్స్ తోపాటు కోహ్లీ లాంటి యంగ్ ప్లేయర్స్ చాలామంది ఉండేవారు. 2009లో ఫైనల్ కి వచ్చింది కానీ కప్ కొట్టలేకపోయింది. కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాతైనా కప్ కొడుతుందనుకుంటే అదీ లేకుండా పోయింది. దీంతో ఏకంగా కెప్టెన్సీనే వదిలేసుకున్నాడు. ఇప్పుడైనా కప్ గెలుస్తుంది అనుకుంటే.. ఛాన్సులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో కోల్ కతా బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేయడం పెద్ద హాట్ టాపిక్ అయింది.
అదేంటి ముంబయితో మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేస్తే.. ఆర్సీబీకి వచ్చిన నష్టం ఏంటని అనుకుంటున్నారా? కేకేఆర్ తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా ఇతడు నిలిచాడు. 2008లోని ఐపీఎల్ తొలి మ్యాచ్ లో మెక్ కల్లమ్ సెంచరీ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ జట్టు బ్యాటర్ శతకం బాదాడు. దీంతో సోషల్ మీడియాలో కొత్త థియరీ ఒకటి చెబుతున్నారు. కేకేఆర్ ఫస్ట్ సెంచరీ దెబ్బకు ఆర్సీబీ.. 15 ఏళ్లుగా కప్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మరో 15 ఏళ్లు వెయిటింగ్ తప్పదా? అని మాట్లాడుకుంటున్నారు. ఇది జోక్ గానే అంటున్నప్పటికీ.. ఆర్సీబీ తీరు చూస్తే.. దీన్ని నిజం చేసేలా కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.