రెండేళ్ల క్రితం కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. చాలా రంగాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆసీస్‌లు మూతపడ్డాయి.. అత్యవసరం కానీ ఏ పని కూడా జరగలేదు. రోజుల తరబడి ప్రజలకు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గతంలో ఎప్పుడూ చూడని భయంకరమైన వైరస్‌ను 2020లో ప్రపంచం చూసింది. ఆ మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా కొన్ని రూపాల్లో మనల్ని వెంటాడుతూనే ఉంది. కానీ.. ఇప్పుడు కరోనా వైరస్ బలహీన పడి ప్రాణాంతకం కాదని తెలిసిన తర్వాత.. దాన్ని లెక్కచేయడంలేదు జనాలు. కరోనా వస్తే.. జస్ట్ జలుబు చేసినట్లు ఫీల్ అవుతున్నారు. ఇక క్రికెట్‌లో అయితే.. ఒకప్పుడు జలుబు లక్షణాలు ఉన్నా.. మ్యాచ్‌లనే రద్దు చేసేవారు. ఇప్పుడు ఏకంగా కరోనా పాజిటివ్ అని తేలినా మ్యాచ్ ఆడుతున్నారు.
తాజాగా.. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌తోనే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్కస్ స్టోయినీస్ కరోనా వచ్చినా మ్యాచ్ ఆడాడు. అతనితో పాటు మరో స్టార్ క్రికెటర్ జో బర్న్స్ సైతం కరోనా బారిన పడ్డాడు. అయినా కూడా వీరిద్దరూ మంగళవారం సిడ్నీ థండర్‌తో మ్యాచ్ ఆడారు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న స్టోయినీస్, బర్న్స్‌కు బిగ్‌బాష్ లీగ్ ఆరంభానికి ముందే కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే.. కరోనా వచ్చినా కూడా మ్యాచ్ ఆడొచ్చని బిగ్‌బాష్ లీగ్ నిర్వహకులు నిబంధనలు సడలించడంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగారు. కరోనాతో ఆడిన స్టోయినీస్ గోల్డెన్ డక్ కాగా, బర్న్స్ 18 పరుగులు చేశాడు. ఒక వికెట్ తేడాతో సిడ్నీ థండర్ విజయం సాధించింది.
అయితే.. ఇటివల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లోనూ కరోనా నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న బయోబబుల్ సిస్టమ్ కూడా ఇప్పుడు లేదు. అయితే.. కరోనా వచ్చిన వారితో కలిసి ఆడితే.. మిగతా క్రికెటర్ల సంగతి ఏంటని? ఆందోళన చెందకండి.. ఎందుకంటే.. కరోనా పాజిటివ్ అని తేలగానే వీరికి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించారు. అలాగే డగౌట్‌లో మిగతా టీమ్‌తో కలిసి కూర్చోకుండా.. వేరుగా కూర్చోవాలి. ప్రయాణం కూడా వేరుగా చేయాలి. అయితే.. కరోనా వచ్చిన రెస్ట్ తీసుకోకుండా బిగ్‌బాష్ లీగ్ ఆడుతున్న స్టోయినీస్‌పై క్రికెట్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం మరీ ఇంత రిస్క్ తీసుకోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అదే దేశం తరఫున సిరీస్‌లు ఆడాల్సి వస్తే.. మాత్రం విశ్రాంతి పేరుతో తప్పించుకుంటారని ఆరోపిస్తున్నారు. మరి.. కరోనా వచ్చినా స్టోయినీస్ బిగ్‌బాష్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Marcus Stoinis and Joe Burns Have Had A Pretty Tough Day!#Cricket #BBL12 #BigBash #MarcusStoinis #JoeBurns #Australia pic.twitter.com/bIyMqF35Xq
— CRICKETNMORE (@cricketnmore) December 13, 2022