ఐపీఎల్ 2022 సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన రెండు కొత్త జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. చివరికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్‌పై హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. ఆ జట్టు టాప్‌ఆర్డర్ కుప్పకూలింది. గుజరాత్ బౌలర్ షమీ చెలరేగడంతో కేవలం 29 పరుగులకే లక్నో 4 వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్ దీపక్ హుడా, యువ క్రికెటర్ ఆయుశ్ బదోని అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. దీంతో లక్నో ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేయగలిగింది.
ఈ లక్ష్యం కాపాడుకోవడంలో మాత్రం కేఎల్ రాహుల్ సేన విఫలం అయింది. గుజరాత్ ఆరంభంలో రెండు వికెట్లు త్వరగానే కోల్పోయినా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తప్పిదాల కారణంగా లక్నోకు ఓటమి తప్పలేదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా లక్నో మెయిన్ బౌలర్ దుష్మంత చమీరాతో పూర్తి కోటా బౌలింగ్ చేయించకపోవడం.. దీపక్ హుడాకు 3 ఓవర్లు ఇవ్వడం రాహుల్ చేసిన ఘోర తప్పిదం. దీపక్ హుడా 3 ఓవర్లు వేయడంతో చమీరా తన కోటా పూర్తి చేసే అవకాశం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన దీపక్ హుడా ఏకంగా 22 పరుగుల సమర్పించుకున్నాడు.అప్పటి వరకు లక్నో వైపు మొగ్గి ఉన్న విజయం కాస్తా గుజరాత్ వైపు వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్ బ్యాటర్లు మిగతా పనిని పూర్తి చేశాడు. దీపక్ హుడా వేసిన 16వ ఓవర్ తొలి బంతి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసి స్ట్రైక్ రాహుల్ తెవాటియాకు ఇచ్చాడు. తర్వాతి బంతుల్లో తెవాటియా వరుసగా 6, 4తో చెలరేగాడు. 4వ బంతికి సింగల్ తీశాడు. ఆ తర్వాత మిల్లర్ కూడా 4, 6తో ముగించాడు. ఇలా హుడాను తెవాటియా, మిల్లర్ చితక్కొట్టారు. మొత్తం మూడు ఓవర్లు వేసిన దీపక్ హుడా ఏకండా 31 పరుగులు సమర్పించుకున్నాడు.
గెలిచినట్టే గెలిచి ఓడిపోవడం.. రాహుల్‌కు అలవాటే
కొత్త లక్నోతోనైనా కెప్టెన్‌గా తన అదృష్టం మారుతుందని భావించిన కేఎల్ రాహుల్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. గతంలో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ కెప్టెన్‌గా ఆ జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ఆ జట్టు అనేక సందర్భాల్లో గెలుపు ముంగిట్లోకి వచ్చి ఓడిపోయేది. ఇప్పుడు లక్నో కూడా తమ తొలి మ్యాచ్‌లో గెలుస్తున్నట్లే కనిపించి ఓడిపోయింది. దీంతో కొత్త జట్టు లక్నోకి కెప్టెన్ అయినా కేఎల్ రాహుల్ లక్కు మారలేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కెప్టెన్‌గా రాహుల్ తప్పిదం, అతని అదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB కి దొరికిన మరో ABD..! కోహ్లీతో అదే బంధం!
Absolute cracker from Dushmantha Chameera! 👌 👌
His yorker does the trick as @LucknowIPL pick the 2nd #GT wicket. 👍 👍
Follow the match ➡️ https://t.co/u8Y0KpnOQi#TATAIPL | #GTvLSG pic.twitter.com/PEbHRE8rYP
— IndianPremierLeague (@IPL) March 28, 2022
🎼 For best results, read this while humming 𝙋𝙚𝙝𝙡𝙖 𝙣𝙖𝙨𝙝𝙖 …𝙥𝙚𝙝𝙡𝙖 𝙠𝙝𝙪𝙢𝙖𝙖𝙧#SeasonOfFirsts #AavaDe #GTvLSG #TATAIPL pic.twitter.com/zD8yA4CQDg
— Gujarat Titans (@gujarat_titans) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.