ఐపీఎల్ లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టినా.. గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం చెలరేగి ఆడాడు. 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి గుజరాత్ కి భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషిచాడు. ఈ క్రమంలోనే తన పేరిట ఒక కొత్త రికార్డుని నమోదు చేసాడు.
అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఐపీఎల్ ఈ రోజు అర్ధ రాత్రి ముగిసిపోయింది. ఆదివారం మొదలవ్వాల్సిన మ్యాచ్.. పలు సార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మంగళవారం అర్ధ రాత్రి ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఆమధ్య జరిగిన ఈ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఇక ఈ ఫైనల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో ఎమోషన్స్ అభిమానులని అలరించాయి. వీటిలో గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ యంగ్ ప్లేయర్ చిన్న విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పాడు.
సాయి సుదర్శన్ ఈ పేరు విన్నవారు చాలా తక్కువమందే ఉంటారు. గిల్, పాండ్య, మిల్లర్, రషీద్, తెవాటియా లాంటి స్టార్ బ్యాటింగ్ కలిగిన జట్టులో ఈ కుర్రాడు చెలరేగి ఆడతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అంచనాలు అన్ని స్టార్ ఆటగాళ్ల మీద ఉంటే సుదర్శన్ మాత్రం అంచనాలకు మించి ఆడాడు. కేవలం 47 బంథిల్లోనే 6 సిక్సులు, 8 ఫోర్ల సహాయంతో 96 పరుగులు చేసాడు. మొదట్లో కాస్త నిదానంగా బ్యాటింగ్ చేసిన సుదర్శన్ క్రమంగా స్ట్రైక్ రేట్ పెంచుతూ చెలరేగి ఆడాడు. 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నా ఈ యంగ్ బ్యాటర్ తర్వాత 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం గమనార్హం.
ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన అన్ క్యాపుడ్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ రికార్డ్ ఇప్పటివరకు మనీష్ పాండే పేరిట ఉంది. 2014 ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై మనీష్ పాండే 94 పరుగులు చేసాడు. నిన్నటి మ్యాచ్ తో సాయి సుదర్శన్ ఆ రికార్డ్ బ్రేక్ చేసాడు. అయితే సాయి సుదర్శన్ ఈ మ్యాచులో భారీ ఇన్నింగ్స్ ఆడినా.. తన టీం గుజరాత్ ఈ ఫైనల్లో ఓడిపోయింది. మొత్తానికీ తాను మాత్రం ఒక అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే సాయి సుదర్శన్ ఈ రికార్డ్ క్రియేట్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023