బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో క్రికెటర్లపై కోట్ల వర్షం కురిసింది. ఎవరూ ఊహించని రీతిలో కొంతమంది ఆటగాళ్ల భారీ ధర పలికితే.. మరికొంత మందని ఏ ఫ్రాంచైజ్ పట్టించుకోలేదు. ఇలా షాక్ మీదా షాక్‌లతో ఐపీఎల్ వేలం తొలి రోజు సాగింది. కాగా ఈ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్‌కు ఏకంగా రూ.10 కోట్ల ధర దక్కింది.
అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. కాగా జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణిస్తారు. ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు ఇంత భారీ మొత్తం దక్కడం నిజంగా విశేషమే. మరి ఆవేశ్ ఖాన్‌కు దక్కిన ధర, సూపర్ జెయింట్స్ అతన్ని దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.