ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో నోబాల్ పై అంపైర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహించడం ఆసక్తిని కలిగించింది.
ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫామ్ లో ఉన్న క్లాసేన్(47), అబ్దుల్ సమద్(37) భారీ భాగస్వామ్యం నెలకొల్పగా.. ఓపెనర్ అల్మొప్రీత్ సింగ్(36) కెప్టెన్ మార్కరం(28) , త్రిపాఠి(20) తలో చేయి వేశారు. బౌలింగ్ లో కృనాల్ పాండ్య పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో నోబాల్ పై అంపైర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహించడం ఆసక్తిని కలిగించింది.
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఆవేశ ఖాన్ బౌలింగ్ కి వచ్చాడు. ఈ ఓవర్లో వేసిన మూడో బాల్ హై ఫుల్ టాస్ వెళ్ళింది. దీంతో అంపైర్.. థర్డ్ అంపైర్ ని సంప్రదించగా.. థర్డ్ అంపైర్ అల్ట్రా ఎడ్జ్ లో పరిశీలించి బంతి సమద్ బ్యాట్ తాకి వెళ్తుందని అది నోబాల్ కాదని చెప్పాడు. దీంతో బ్యాటర్లు క్లాసేన్, సమద్ తో సహా అందరు షాక్ కి గురయ్యారు. బాల్ క్లియర్ గా నడుము భాగాన్ని దాటి వెళ్తున్నా.. అంపైర్ దాన్ని నోబాల్ గా ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంఘటన సన్ రైజర్స్ అభిమానులకి కోపం తెప్పించింది.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు థర్డ్ అంపైర్ ని తిడుతూనే.. లక్నో డగౌట్ వైపు కొన్ని వస్తువులను విసిరారు. అవి వచ్చి లక్నో డగౌట్ లో పడగానే అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో లక్నో ఆటగాళ్లు డగౌట్ వైపుగా రావడం.. డికాక్, క్లాసేన్ నోబాల్ గురించి చర్చించడం జరిగాయి. ఈ క్రమంలో ఒక పది నిమిషాలు మ్యాచ్ ఆగిపోవడం జరిగింది. అయితే గొడవ పెద్దది అవుతుందని గ్రహించిన అంపైర్లు.. మళ్ళీ లక్నో ఆటగాళ్లను డగౌట్ కి పంపించి ఆటను ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఇది నిజంగా నోబాల్ అవునా కాదా అనే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
After a controversial reversal of no ball decision by the third umpire, the SRH fans in the stadium are showing their frustrations at the LSG dugout.
The crowd were also heard chanting, “Kohli, Kohli” with Gambhir in the dugout 👀
📸 JioCinema#SRHvLSG #SRH #SRHvsLSG pic.twitter.com/jPti6MyaFe
— 12th Khiladi (@12th_khiladi) May 13, 2023