స్టోయినిస్, పూరన్ చెలరేగడంతో.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో లక్నో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో లక్నో ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నారు. ఈ క్రమంలోనే లక్నో ఆటగాడు ఆవేశ్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. దాంతో బీసీసీఐ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
IPL 2023లో భాగంగా సోమవారం లక్నో-ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు అసలైన క్రికెట్ మజాను చూపించింది. చివరి బంతికి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గెలుపు దోబూచులాడింది. దాంతో ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ రేగింది. అయితే చివరికి ఆర్సీబీ బౌలర్లు ఒత్తిడికిలోనై ఓటమిని మూటగట్టుకున్నారు. అసలైతే ఈ మ్యాచ్ లో విజయం ఆర్సీబీదే అని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్టోయినిస్, పూరన్ చెలరేగడంతో.. లక్నో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో లక్నో ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నారు. ఈ క్రమంలోనే లక్నో ఆటగాడు ఆవేశ్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. దాంతో బీసీసీఐ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఐపీఎల్ 16వ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తూ.. ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా సోమవారం జరిగిన మ్యాచ్ అయితే ఐపీఎల్ కే హైలెట్ అని చెప్పాలి. లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఓ అద్భుతమనే చెప్పాలి. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో బ్యాటర్ల దాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో కోహ్లీ(61), డుప్లెసిస్ (79*) మాక్స్ వెల్ (59) రన్స్ తో విజృంభించారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకి అంత మంచి ఆరంభం దక్కలేదు. దాంతో లక్నో టీమ్ ఓడిపోతుంది అని అందరు అనుకున్నారు. కానీ ఇది టీ20 చివరి బాల్ వరకు విజయం దోబూచులాడుతుంది అన్న సంగతి మనకు తెలిసిందే.
ఇక లక్నో జట్టులో కైల్ మేయర్స్(0), రాహుల్(18), హుడా(9), కృనాల్ పాండ్యా(0)లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దాంతో లక్నో ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. ఈ క్రమంలోనే స్టోయినిస్(65), పూరన్(62) పరుగులతో చెలరేగడంతో.. లక్నో అద్బుతమైన విజయం సాధించింది. ఇక చివరి ఓవర్లో లక్నో సూపర్ విక్టరీ సాధించడంతో.. క్రీజ్ లో ఉన్న రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ లు తమ సెలబ్రేషన్స్ ను ఓ రేంజ్ లో చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆవేశ్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. గెలిచిన తర్వాత తన హెల్మెట్ ను తీసి గ్రౌండ్ కు బలంగా కొట్టాడు. దాంతో అతడి ఓవర్ యాక్షన్ కు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐపీఎల్ క్రికెట్ నిబంధనల ప్రకారం లెవల్ 1, 2.2 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అతడిని మందలించింది. అయితే ఆవేశ్ ఖాన్ సైతం తన తప్పును ఒప్పుకోవడంతో.. ఈసారికి మందలించి వదిలేసింది బీసీసీఐ. మరి ఆవేశ్ ఖాన్ గ్రౌండ్ లో చేసిన ఓవర్ యాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
— IndianPremierLeague (@IPL) April 10, 2023
Avesh Khan admitted to level 1 offence 2.2 of IPL’s Code of Conduct and accepted the sanction for wild celebrations in the match against RCB.
— CricketMAN2 (@ImTanujSingh) April 11, 2023