Avesh Khan: ఒక్క పరుగు కూడా చేయకుండానే మ్యాచ్ తానే గెలిపిచినంత హంగామా చేశాడు. హెల్మెట్‌నే నేలకేసి కొట్టి సోషల్ మీడియాలో దారుణ ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ.. ఇప్పుడు అతనే హీరోగా మారిపోయాడు.
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు ఊహలకు అందకుండా జరుగుతున్నాయి. ఏ టీమ్ గెలుస్తుందో చివరి బాల్ వరకు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్కో మ్యాచ్ ఒక్కో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా షాకింగ్ ట్విస్ట్‌తో ముగిసింది. మ్యాచ్ మరో 8 ఓవర్లు ఉన్న సమయం వరకు గెలుపు రాజస్థాన్‌దే అని మినిమమ్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్లేయర్ సైతం చెప్పే.. స్థితిలో ఉంది. కానీ.. అనూహ్యంగా మ్యాచ్‌ను లక్నో గెలిచింది. ఇది నిజంగా షాకింగ్ విజయమే.. ఈ గెలుపును లక్నో అభిమానులు కూడా నమ్మే స్థితిలో లేరు. కానీ జరిగింది మాత్రం అదే. దీనికి ప్రధాన కారణం లక్నో స్టార్ బౌలర్ ఆవేశ్ ఖాన్.
ఈ నెల 10న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో భారీ టార్గెట్‌ను ఛేదించి గెలిచింది. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 212 పరుగుల భారీ స్కోర్ చేసి.. లక్నో ముందు 213 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో మ్యాచ్ చివరి బాల్ వరకు వెళ్లింది. చివరి బాల్‌కు ఒక్క పరుగు అవసరమైన సమయంలో స్ట్రైక్‌లో ఉన్న ఆవేశ్ ఖాన్ బాల్‌ను కొట్టబోయి మిస్ అయ్యాడు. అయినా కూడా బైస్ రూపంలో ఒక పరుగు తీయడంతో లక్నో ఒక్క వికెట్ తేడా విజయం సాధించింది. గెలిచిన ఆనందంలో ఆవేశ్ ఖాన్ తన హెల్మెట్‌ను తీసి నెలకు కొట్టాడు. ఈ చేష్ట వైరల్‌గా మారింది. ఒక్క రన్ కూడా కొట్టకుండానే మ్యాచ్ తానే గెలిపించనట్లు ఆవేశ్ ఫీల్ అవుతున్నాడని.. ఇంత ఓవర్ యాక్షన్ గాడిని ఇంత వరకు చూడలేదంటూ క్రికెట్ అభిమానులు మండిపడ్డారు.
అయితే.. బుధవారం రాజస్థాన్-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌తో ఆవేశ్ ఖాన్ హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠగా సాగింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలవాలి. మ్యాచ్ చాలా వరకు వారి తుల్లోనే ఉంది. కానీ, డెత్ ఓవర్స్‌లో ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ వేసి.. లక్నోకు విజయాన్ని అందించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన ఆవేశ్ ఖాన్.. కేవలం 25 పరుగులిచ్చి 3 వికెట్లతో సత్తా చాటాడు. దేవదత్త్ పడిక్కల్, హెట్‌మేయర్, ధృవ్ జురెల్ లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 19 పరుగులు కావాల్సిన సమయంలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు తీసి.. లక్నోను గెలిపించాడు. ఓవర్ యాక్షన్ ప్లేయర్ అంటూ నిన్నటి వరకు తిట్లు తిన్న ఆవేశ్ ఖాన్ ఒక్క మ్యాచ్‌తో తింటిన వారి నుంచే ప్రశంసలు అందుకుంటున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
LUCKNOW SUPERGIANTS WON.
AVESH KHAN DEFENDED 20 RUNS IN THE FINAL OVER. pic.twitter.com/WjsTaxIc98
— Titu (@TituTweets_) April 19, 2023