టీమిండియా బౌలర్ ఆవేశ్ ఖాన్ సంచలన బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. బ్యాటర్లను వణికిస్తూ.. ఏకంగా 7 వికెట్లతో రెచ్చిపోయాడు. టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత.. దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టిన ఆవేశ్ ఖాన్, మధ్యప్రదేశ్ తరఫున రంజీ సీజన్ 2022-23లో ఆడుతున్నాడు. మంగళవారం మధ్యప్రదేశ్-విదర్భ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగాడు. అతని దెబ్బకు విదర్భ కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఆటగాడు రజత్ పటీదార్(121) సెంచరీతో చెలరేగడంతో మధ్య ప్రదేశ్‌కు మంచి స్కోర్ లభించింది.
ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విదర్భను మధ్యప్రదేశ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ తన అద్భుత బౌలింగ్‌తో వణికించాడు. 22 ఓవర్లు వేసిన ఆవేశ్ కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. మరో విశేషం ఏమిటంటే.. 8 ఓవర్లు మెయిడిన్‌గా వేసి విదర్భ పతనాన్ని శాసించాడు. ఆవేశ్ దెబ్బకు విదర్భ కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. విదర్భ ఇన్నింగ్స్‌లో సంజయ్ రఘునాథ్(58) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. విదర్భ జట్టులో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
ఇక దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా ఆవేశ్ ఖాన్‌కు టీమిండియాలో చోటు దక్కింది. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఆవేశ్‌కు భారత జట్టులో భారీగానే అవకాశాలు దక్కాయి. మొత్తం 5 వన్డేలు, 15 టీ20లు ఆడిన 16 వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఆవేశ్ నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో.. జట్టులో స్థానంతో పాటు టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఆవేశ్.. ఐపీఎల్ 2022లో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. ఆ టీమ్‌లో ఆవేశ్ కీ ప్లేయర్‌గా ఉన్నాడు. అలాగే ఇప్పటికే వరకు 38 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆవేశ్ 47 వికెట్లు పడగొట్టాడు. మరి తాజాగా రంజీలో ఆవేశ్ ఖాన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a spell by Avesh khan🔥#AveshKhan #ranjitrophy2022 #RanjiTrophy #Cricket #CricketTwitter pic.twitter.com/d7qhJC8nGj
— Vtrakit Cricket (@Vtrakit) January 5, 2023