ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి అంతా సిద్దం అయ్యింది. మరికొన్ని గంటల్లో ధనాధన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల బలాలను, బలహీనతలను అంచనా వేస్తున్నారు అభిమానులు. మరి ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ స్ట్రెంత్, వీకెనెస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గతేడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. వావ్ అనిపించే ప్రదర్శన చేసింది. కానీ ఏడాది తిరిగేసరికి సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మరి ఈ సీజన్ లో లక్నో బలం, బలహీనతలు ఏంటి? ఐపీఎల్ పేరు చెప్పగానే కేఎల్ రాహుల్ హీరో అని చెప్తుంటారు అభిమానులు. మరి ఈసారి లక్నోకు కప్ అందిస్తాడా? లేదో? చూడాలి.
ఐపీఎల్ అనగానే ప్రతి జట్టు టార్గెట్.. కప్ గెలుచుకోవడం, ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడం. ఇందులో భాగంగానే మ్యాచుల్లో గెలిచి అద్భుతమైన మజాని అందిస్తారు. గతేడాది ముందు వరకు ఐపీఎల్ అనగానే ఎనిమిది జట్లే గుర్చొచ్చేవి. మధ్యలో ఓ రెండు మూడు సీజన్లలో కొత్త జట్లు వచ్చినా సరే అవి అలానే వెళ్లిపోయాయి. గతేడాది మాత్రం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కొత్తగా చేరాయి. ఈ రెండు కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. గుజరాత్ కప్ కొట్టగా, లక్నో మాత్రం విజేతగా నిలవలేకపోయింది. మరి ఈ సీజన్ కోసం రెడీ అయిన లక్నో జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయి? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం?
ఇక విషయానికొస్తే.. కేఎల్ రాహుల్ ఈ పేరు చెప్పగానే అందరూ ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ ప్లేయర్ అని ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న టైంలో జట్టు విజయాల సంగతి అటుంచితే ఓపెనర్ గా రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేసేవాడు. గత సీజన్ లోనూ అలానే ఆడాడు. లక్నో జట్టు క్వాలిఫయర్స్ చేరుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్ అంటే కొత్త జట్టు ఊపు మీద ఉంది కాబట్టి అలా నడిచిపోయింది. ఈసారి మాత్రం అలా కనిపించట్లేదు. ఈ క్రమంలోనే జెర్సీలోనూ మార్పులు చేశారు. మరి అది ఎంతవరకు కలిసొస్తుంది? ఏంటనేది తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ పేరు చెప్పగానే అందరూ బ్యాటర్ల గురించే మాట్లాడుకుంటారు. అందుకే తగ్గట్లే లక్నో జట్టులోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ అయితే గత ఏడాది ఐపీఎల్ తర్వాత నుంచి ఘోరంగా ఫెయిలవుతూ వస్తున్నాడు. అందరూ ఇతడిని తెగ విమర్శిస్తున్నారు. వాళ్లందరి నోళ్లు మూతపడాలంటే రాహుల్ ఫామ్ అందుకోవాలి. లేదంటే లక్నోకి చాలా కష్టమైపోతుంది. ఇక డికాక్, పూరన్ లాంటి బ్యాటర్లతో పాటు స్టోయినిస్, కృనాల్ పాండ్య, డేనియల్ సామ్స్ లాంటి ఆల్ రౌండర్లతో పాటు యువ సంచలన ఆయుష్ బదోనితో బ్యాటింగ్ ఆర్డర్ పర్వాలేదనిపిస్తోంది. కేఎల్ రాహుల్ తోపాటు వీళ్లలో ఎవరూ క్లిక్ అయినా సరే ఈజీగా భారీ స్కోర్లు చేస్తారు. ఈ విషయంలో లక్నో టీమ్ కు ఎలాంటి బెంగలేదు.
బ్యాటింగ్ విషయంలో లక్నోకు పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు. వచ్చిన చిక్కంతా బౌలింగ్ తోనే. ఎందుకంటే స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం కాస్త చెప్పుకోదగ్గర బౌలర్ గా కనిపిస్తున్నాడు. మిగతా వారిలో స్పిన్నర్ అమిత్ మిశ్రా, పేసర్లు ఆవేష్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్.. గత సీజన్ లో చెప్పుకోద్దగ ఫెర్ఫార్మెన్సులు అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈ సీజన్ లోనూ వాళ్లపై పెద్దగా అంచనాల్లేవు. దీంతో లక్నో బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. బ్యాటర్లు భారీ స్కోరు బాదినా సరే లక్నో బౌలర్లు దాన్ని డిఫెండ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రారంభ మ్యాచుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది. చూడాలి మరి లక్నో ఈ విషయంలో ఏం చేస్తుందో?
లక్నో సూపర్ జెయింట్స్ బలం బలహీనత కెప్టెన్ కేఎల్ రాహుల్ అనిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్ లో కెప్టెన్, బ్యాటర్ గా ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీన్ని కంటిన్యూ చేస్తే మాత్రం లక్నో పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఒకవేళ ఫామ్ లోకి వచ్చేస్తే మాత్రం లక్నో టీమ్ కి బ్యాటింగ్ పరంగా తిరుగుండదు. ఇక ఫీల్డింగ్, బౌలింగ్ లోనూ కొత్త టెక్నిక్స్ తో బరిలోకి దిగాలి. లేదంటే మాత్రం ‘lucknow’ కాస్త ‘luck-no’ టీమ్ అవుతుంది. గతేడాది లైట్ బ్లూ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ సీజన్ కి వచ్చేసరికి పూర్తిగా బ్లూ జెర్సీగా మార్చేసుకుంది. మరి జెర్సీ మార్పు లక్నో అదృష్టాన్ని ఏమైనా మార్చుతుందా? అనేది చూడాలి.