ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందర్ని షాక్‌కు గురిచేయగా.. అంతకు ముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ దినేష్ రామ్‌దిన్ కూడా సోమవారం ఉదయం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వీరిద్దరితో పాటు మరో కరేబియన్ స్టార్ క్రికెటర్ లెండిల్ సిమన్స్ కూడా సోమవారం నాడే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
సిమన్స్ 2006లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయినా కూడా సిమన్స్ విండీస్ సాధించిన రెండు టీ20 వరల్డ్ కప్ టీమ్స్‌లో భాగమయ్యాడు. దేశానికి ప్రాతినిథ్య వహించే అవకాశం కల్పించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఈ సందర్భంగా సిమన్స్ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు విండీస్ జట్టును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించాడు.
సిమన్స్ తన కెరీర్‌లో 8 టెస్టులు ఆడి 278 పరుగులు చేశాడు. అలాగే 68 వన్డేల్లో 1958 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 68 టీ20 మ్యాచ్‌ల్లో 1527 పరుగులు చేశాడు. అందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా సిమన్స్ 2014-2017 మధ్య ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
29 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిమన్స్ 1079 పరుగులు చేశాడు. సిమన్స్‌కు ఐపీఎల్‌లో ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా ఐపీఎల్‌లో అత్యధిక కప్పులు సాధించిన ముంబై ఇండియన్స్ 2015, 2017లో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు. మరి సిమన్స్ రిటైర్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Lendl Simmons (@54simmo) July 18, 2022