సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేస్తుండగా.. సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్ లాంటి మాజీ క్రికెటర్లు ఆడుతుంటే చూసేందుకు రెండో కళ్లు సరిపోవు. నైంటీస్‌లో వీరి ఆటను చూసి వారి అభిమానులుగా మారిపోయిన వారికి మరోసారి వారి ఆటను చూసే భాగ్యం కలగనుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా దిగ్గజ మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వయసు మీద పడుతున్నా.. ఒక మంచి కాజ్ కోసం, తమ అభిమానుల కోసం బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. కాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ సారి ఈ టోర్నీ భారత్‌లోనే జరుగుతుండటం విశేషం.
ఈ టోర్నీ దేశవ్యాప్తంగా మొత్తం ఐదు నగరాల్లో జరగనుంది. కోల్కత్తా, న్యూఢిల్లీ, కటక్, లక్నో, జోధ్‌పూర్ వేదికగా లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్లేఆఫ్ వేదికలు ఇంకా ఖారారు కాలేదు. కాగా ఈ టోర్నమెంట్ ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో మొదలుకానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఓ చారిటీ మ్యాచ్ నిర్వహించనున్నారు.
కాగా ఇండియా మహారాజాస్ టీమ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రెస్టాఫ్ వరల్డ్ జెయింట్స్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక సెప్టెంబర్ 17 నుంచి అసలైన టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలో సెప్టెంబర్ 16, 17, 19న, లక్నోలో 21, 22న, న్యూఢిల్లీలో 24, 25, 26న, కటక్‌లో 27, 29, 30న, జోధ్‌పూర్‌లో అక్టోబర్ 1, 3న మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే అక్టోబర్ 5, 7న ప్లేఆఫ్ మ్యాచ్‌లు, 8న ఫైనల్ జరగనుండగా వేదికలు ప్రకటించాల్సి ఉంది. మరి ఈ టోర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: గంగూలీ కాదు.. అతను చెప్పడం వల్లే నేను ఓపెనర్‌గా మారా: వీరేంద్ర సెహ్వాగ్
Legends League Cricket returns on September 17th. Kolkata, Lucknow, Delhi, Cuttack and Jodhpur are the venues for LLC 2022 league stage.
(X – Special match, R1 – Round 1, R2 – Round 2, Q – Qualifer, E – Eliminator, F – Final) pic.twitter.com/cGb3im2j8W
— CricTracker (@Cricketracker) August 24, 2022