టీమిండియా మాజీ సారధి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం దాదా బ్యాటింగ్ చూశాం.. మళ్లీ ఇన్నాళ్లకు చూడబోతున్నాం.. అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? అన్నదేగా మీ సందేహం.. లెజెండ్స్ లీగ్ నుంచి గంగూలీ తప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది నిజమే సుమా! దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ […]
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేస్తుండగా.. సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్ లాంటి మాజీ క్రికెటర్లు ఆడుతుంటే చూసేందుకు రెండో కళ్లు సరిపోవు. నైంటీస్‌లో వీరి ఆటను చూసి వారి అభిమానులుగా మారిపోయిన వారికి మరోసారి వారి ఆటను చూసే భాగ్యం కలగనుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా దిగ్గజ మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వయసు మీద పడుతున్నా.. ఒక మంచి కాజ్ కోసం, తమ అభిమానుల కోసం బరిలోకి దిగేందుకు […]