టీమిండియా మాజీ సారధి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం దాదా బ్యాటింగ్ చూశాం.. మళ్లీ ఇన్నాళ్లకు చూడబోతున్నాం.. అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? అన్నదేగా మీ సందేహం.. లెజెండ్స్ లీగ్ నుంచి గంగూలీ తప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది నిజమే సుమా!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా సంబరాలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 తాజా సీజన్ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కావాల్సివుంది. సెప్టెంబరు 16న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే.. ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా గంగూలీ వ్యవహరించనున్నాడని ప్రకటన విడుదల చేశారు నిర్వాహకులు. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్ నుంచి గంగూలీ తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రొఫెషనల్ కమ్మిట్‌మెంట్స్, వ్యక్తిగత కారణాల వల్ల.. గంగూలీ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
No Sourav Ganguly in Legends League. pic.twitter.com/uBpKllazFE
— Dr. Cric Point 🏏 (@drcricpoint) September 3, 2022
‘లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీకి నా బెస్ట్ విషెస్. రిటైర్ అయిన క్రికెటర్లను మళ్లీ మైదానంలోకి తీసుకొచ్చి, అభిమానులను సంతోషపెట్టాలనేదే.. నా ఆలోచన. ఈ లీగ్‌లో నేనూ, ఓ మ్యాచ్ ఆడాలని అనుకున్నాను. అయితే నా ప్రొఫెషనల్ కమ్మిట్‌మెంట్స్, వ్యక్తిగత కారణాల వల్ల ఈ గేమ్ నేను ఆడడం లేదు’ అని గంగూలీ పేర్కొనట్లు ఇండియా టుడే వెల్లడించింది. గా ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లాండ్ మాజీ సారధి ఇయాన్ మెర్గాన్ సారథిగా వ్యవహరించనున్నాడు. గంగూలీ ఆటను మరోసారి మైదానంలో చూడగలమా! మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.