కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పిన్ వేస్తాడు అనే విషయం అందరికీ తెలుసూ.. కానీ, అప్పుడప్పుడు బ్యాటర్ల వికెట్‌తో పాటు మతి పోయే బాల్స్ వేస్తుంటాడు. అలాంటి డ్రీమ్ డెలవరీని ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వేశాడు.
చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 269 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్, మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బాల్ వేశాడు. పిచ్ నుంచి కాస్త టర్న్ లభించాలే కానీ, బ్యాటర్లను వణికించే కుల్దీప్, చెన్నై పిచ్‌పై బ్యాటర్లు బాగానే బ్యాటింగ్ చేస్తున్నా.. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేసిన విధానం అయితే మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. తొలి బంతికే అలెక్స్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. పేస్, బౌన్స్‌ను ఆడటం ఎక్కువగా అలవాటైన అలెక్స్‌కు స్పిన్ రుచి చూపించాడు. కుల్దీప్ బాల్ దెబ్బకు అలెక్స్ కళ్లు తేలేశాడు. అలా ఎలా వెళ్లింది అన్నట్లు పేస్ పెట్టాడు. లెగ్ స్టంప్ బయట పడిన బాల్.. బొంగరంలా గిర్రున తిరిగి.. ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. అక్కడ ఏం జరిగిందో పాపం.. అలెక్స్‌కు అర్థం కాలేదు. అయితే.. ఈ బాల్‌ను క్రికెట్ అభిమానులు డ్రీమ్ బాల్‌గా అభివర్ణిస్తున్నారు. కాగా, కుల్దీప్‌కు ఇలాంటి బాల్స్ వేయడం కొత్తేం కాదు.. గతంలో కూడా ఇలాంటి అద్భుతమైన బంతులను వేసి, బ్యాటర్ల మతి పోగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, తొలుత బ్యాటింగ్ చేసి.. 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరంభించిన మార్ష్.. మంచి ఆరంభం అందించాడు. తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని హార్దిక్ పాండ్యా విడదీశాడు. వెంటవెంటనే పాండ్యా మూడు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా స్పీడ్‌కు బ్రేక్ పడింది. ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. కానీ, అందరు బ్యాటర్లు 20, 30 పరుగుల చేయడంతో ఆసీస్ మంచి స్కోరే నిలబెట్టింది. ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా.. ఆస్ట్రేలియా 269 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, కుల్దీప్ యాదవ్ 3, సిరాజ్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో కుల్దీప్ వేసిన డ్రీమ్ బాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dream ball from Kuldeep Yadav. pic.twitter.com/22QWqwOrRR
— Johns. (@CricCrazyJohns) March 22, 2023