దుబాయి స్టేడియం వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠభరిత పోరు సాగింది. ఎంత అద్భుతంగా రాణించినా కూడా చిన్న చిన్న పొరపాట్లు, అంచనా లోపాల వల్ల పంజాబ్ కింగ్స్ కేవలం 2 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ ఒకానొక దశలో బౌలర్లు చేతులెత్తేసినట్లు కనిపించారు. ఆర్ష్‌దీప్(32 పరుగులకు 5 వికెట్లు) అద్భుత ప్రదర్శనతో భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతున్న రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశాడు. ఒక దశలో 20 ఓవర్లలో 220 పరుగులు చేసేలా కనిపించింది రాజస్థాన్. అలాంటి దశ నుంచి 185 పరుగులకు కట్టడి చేయగలిగారు పంజాబ్ బౌలర్లు.
పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 186 పరుగులు చేయాలి. తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా కూడా మ్యాచ్‌ను ఓడిపోవడం అంటే అది పంజాబ్‌కే సాధ్యం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 15 బంతుల్లో 10 పరుగులు కావాలి. ఆఖరి ఓవర్‌లో విజయం కోసం 4 పరుగులు కావాలి. చివరికి ఫలితం 2 పరుగుల తేడాతో ఓటమి. ఇది పంజాబ్‌కి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి విజయాలు, పరాజయాలు చూశారు పంజాబ్ కింగ్స్. కానీ అదే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూ బ్యాట్ దాకా వచ్చిన విజయాన్ని చేజార్చుకున్నారు.
మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ ఎంతో భావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. అతని మాటలు కూడా అలాగే అనిపించాయి. ‘ఈ మ్యాచ్ ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. గంతంలోనూ ఇలాంటివి ఫలితాలు చూశాం. ఒత్తిడిని జయించడంలో విఫలమవుతున్నాం. గత తప్పిదాల నుంచి మేము ఏమీ నేర్చుకోలేదు’ అన్న రాహుల్ మాటలు చూస్తుంటే ఈ మ్యాచ్ ఫలితాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఇదే తరహా వాతావరణం కనిపించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సహా అనిల్ కుంబ్లే, యాజమాన్యం మొత్తం టీమ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు అవే తప్పులు చేస్తూ మ్యాచ్‌లను చేజార్చుకుంటాం? ఇలాగయితే కప్పు కొట్టేది ఎలాఅంటూ ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పజెప్పడం ఏంటంటూ యాజమాన్యం కూడా బాగా క్లాస్ పీకినట్లు సమాచారం.
మరి ఇకనైనా ఇలాంటి ఒత్తిడి సమయాల్లో పంజాబ్ జట్టు నిజమైన కింగ్స్‌గా నిరూపించుకుంటారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
A tough pill to swallow 😔#PunjabKings #SaddaPunjab #IPL2021 #PBKSvsRRhttps://t.co/7Z2g1QZyTX
— Punjab Kings (@PunjabKingsIPL) September 22, 2021