ఈ ఏడాది చాలా మంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరమయ్యారు. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం టీమిండియాలోని ఒక ఇద్దరు స్టార్లు ఆసియా కప్ కి అందుబాటులో ఉండడం లేదనే సమాచారం వినిపిస్తుంది.
2023 టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఆసియా కప్ తో పాటుగా స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ టోర్నీలు గెలవడం మన జట్టుకి చాలా ముఖ్యం. గతేడాది ఆసియా కప్ టీ 20 లో భాగంగా కనీసం ఫైనల్ కి వెళ్లలేకపోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో ఈ సారి ఆసియా కప్ ఎలాగైనా కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇక 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీ లేని భారత క్రికెట్ జట్టుకి ఈ ఏడాది సొంత గడ్డపై ఆడనుండంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ రెండు మెగా టోర్నీలకు ముందు టీమిండియా లోని కొంతమంది కీలక ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం టీమిండియాలోని ఒక ఇద్దరు స్టార్లు ఆసియా కప్ కి అందుబాటులో ఉండడం లేదనే సమాచారం వినిపిస్తుంది.
ఈ ఏడాది చాలా మంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరమయ్యారు. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం వీరందరూ కోలుకోవడం టీమిండియాకు చాలా అవసరం. కానీ ఆసియా కప్ కి వీరిలో ఒక్కరు కూడా ఆడడం అనుమానంగా మారింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టోర్నీ ఆడలేడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి శ్రేయాస్ అయ్యర్ కూడా చేరాడని తెలుస్తుంది. వెన్నునొప్పితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో జట్టుకు దూరమైన అయ్యర్.. ఆ తర్వాత న్యూజిల్యాండ్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ తర్వాత అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు.
గత కొంతకాలంగా టీమిండియాలో అయ్యర్ అన్ని ఫార్మాట్ లలో కీలక ప్లేయర్ గా మారాడు. అసలే రాహుల్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఎవరిని ఆడించాలో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా వీరిద్దరు లోటు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం అయ్యర్ అంత వేగంగా కోలుకోవడం లేదని సమాచారం. ఇదే కొనసాగితే అతను ఆసియా కప్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించలేడని తెలుస్తోంది. తాజాగా ఎన్సీయేలో అతని వెన్నుకు ఇంజెక్షన్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో రాహుల్ తో పాటు అయ్యర్ కూడా ఆసియా కప్ కి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే టీమిండియా ఆసియా గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. మరి వీరిద్దరూ కనీసం వరల్డ్ కప్ కి అందుబాటులో ఉంటారో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.