ఆసియా కప్ 2023 పాకిస్థాన్ వేదికగా జరగడం పెద్ద చర్చగా మారింది. పాక్‌లో పర్యటించేందుకు సిద్ధంగా లేని టీమిండియా.. ఇదే ఏడాది వన్డే వరల్డ్ కప్‌ను నిర్వహించనుంది. దీంతో.. మీరు రాకుంటే మేము రామంటూ పాక్ ఆటగాళ్లు మారం చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఒక అడుగు ముందుకేసి.. వరల్డ్ కప్ బహిష్కరణ నినాదం ఎత్తుకున్నాడు.
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు క్రేజ్ ఏ విధంగా ఉంటుందో వివాదాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దాయాదుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా అభిమానులకు కావాల్సినంత వినోదం గ్యారంటీ. అయితే చాలా కాలంగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య విభేదాల కారణంగా.. భారత్ పాక్‌లో, పాకిస్థాన్ భారత్‌లో పర్యటించడం లేదు. అయితే ఇరుదేశాల అభిమానులు మాత్రం భారత్-పాక్ సిరీస్‌లు జరగాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసియా కప్ 2023 పాకిస్థాన్ వేదికగా జరగనున్న నేపథ్యంలో భారత్.. పాక్‌లో పర్యటిస్తే.. ఇక రెండు దేశాల మధ్య విభేదాలు తొలుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు భావించింది.
కానీ.. బీసీసీఐ మాత్రం టీమిండియా ఆసియా కప్ 2023 ఆడేందుకు పాక్‌లో పర్యటించడని స్పష్టం చేసింది. అవసరమైతే ఆసియా కప్ వేదికను పాక్ నుంచి యూఏఈకి తరలించేందుకు కూడా సిద్ధపడింది. అందుకు పాక్ సుముఖత వ్యక్తం చేయకపోవడం, భారత్‌లో జరిగే వన్డే వరల్ కప్ 2023లో పాల్గొనమంటూ చేసిన వ్యాఖ్యలతో.. ఇండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించి, మిగతా మ్యాచ్‌లను యాథామిధిగా పాక్‌లోనే నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించినట్లు వార్తలు కూడా వచ్చాయి కానీ.. ఏసీసీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023ను బహిష్కరించాలని డిమాండ్ చేశాడు.
కమ్రాన్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో భారత్ పర్యటించకపోతే భారత వేదికగా జరగబోయే 2023 వన్డే వరల్డ్ కప్‌ను పాకిస్థాన్ బహిష్కరించాలి. అలాగే ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కోసం ఐసీసీ,బీసీసీఐ,పీసీబీ కూడా ఏమి చేయలేవు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఈ విషయం పై మాట్లాడుకోవాలి. భారత్‌లో కూడా చాలా మంది పాకిస్థాన్ ఫ్యాన్స్ ఉన్నారు.’ అని పేర్కొన్నాడు. మరి కమ్రాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“If India do not agree to come for the Asia Cup, we should not go to India to play the 2023 World Cup there. We are also well respected, we have been world champions too, have topped rankings in all formats and have won the Champions Trophy too,” Kamran Akmal.#PSL08 #pakvsind pic.twitter.com/PmI1tK5WAO
— C W S (@SahabShero) February 24, 2023