బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో మూడు పతకాలు కొల్లగొట్టిన మన లిఫ్టర్లు తాజాగా మరో గోల్డ్ మెడల్ ను భారత్ ఖాతాలో వేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కచ్చితంగా పతకాలు సాధించే రంగం వెయిట్ లిఫ్టింగ్. అందుకు అనుగునంగానే మన లిఫ్టర్లు బరువులు ఎత్తి పతకాల వేట కొన సాగిస్తున్నారు. తాజాగా జెరెమీ లాల్ రిన్నుంగా వెయిట్ లిఫ్టింగ్ లో దుమ్మురేపాడు. 67 కేజీల విభాగంలో రికార్డు బద్దలు కొడుతూ గోల్డ్ మెడల్ సాధించాడు. క్లీన్ అండ్ జెర్క్ లో మెుదటి ప్రయత్నంలో 140 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలను ఎత్తాడు.
#JeremyLalrinnunga reacts after winning a gold medal, #India‘s 2nd, at the #CWG2022 pic.twitter.com/meypZ5nUyD
— Hindustan Times (@htTweets) July 31, 2022
దీంతో మెుత్తం 300 కేజీల బరువును లేపి కామన్వెల్త్ క్రీడల్లో రికార్డ్ సృష్టించాడు. అనంతరం జెరెమీ ట్విట్టర్ లో స్పందిస్తూ..” ఈ ఫర్పార్మెన్స్ తో నేను సంతోషంగా లేను అయినప్పటికీ దేశం కోసం ఈ పతకం సాధించడం ఆనందంగా ఉందంటూ” రాసుకొచ్చాడు. ఇప్పటికే ఈ విభాగంలో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించగా, గురురాజ, సంకేత్ లు కాంస్య, రజత పతకాలు కొల్లగొట్టారు. మరి రికార్డ్ బద్దలు కొడుతూ స్వర్ణం సాధించిన ఈ 19ఏళ్ల యువకెరటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
INDIA’s SECOND GOLD at #CommonwealthGames2022🥇
In his first appearance at #CWG, @raltejeremy fetches a Games Record of 140 KGs (Snatch) and also manages a combined lift of 300 KGs to claim a GOLD for INDIA ❤️#BirminghamMeinJitegaHindustanHamara#B2022 #SirfSonyPeDikhega pic.twitter.com/78JGLXlez8
— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2022