ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు బెక్కి బోస్టన్‌ను శనివారం పెళ్లిచేసుకున్నాడు. 2013 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట 2020లో ఉంగరాలు మార్చుకుని గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వివాహం వాయిదా పడుతూ వచ్చింది. అయితే రిలేషన్షిప్లో ఉన్న ఈ జంటకు 2021 అక్టోబర్‌లో ఆల్బీ అనే ఓ పండంటి మగబిడ్డ కూడా పుట్టాడు. ఈక్రమంలో పిల్లాడు పుట్టిన తొమ్మిది నెలలకు వివాహం చేసుకోవడం విశేషం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. క్రికెటర్లు ట్రావిడ్ హెడ్, టిమ్ఫైన్, మిచెల్ స్టార్క్, ఆండ్రూ మెక్ డొనాల్డ్, జోష్ హాజెల్‌వుడ్ తదితర క్రికెటర్లు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అయితే కమిన్స్, బోస్టన్ల ప్రేమ ఖండాంతరాలు దాటింది. కమిన్స్‌ది ఆస్ట్రేలియా కాగా బోస్టన్ది ఇంగ్లండ్. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Pat Cummins gets married to his fiancee Becky Boston. Congratulations to the newly married couple #PatCummins pic.twitter.com/02rRt7jKfa — Cricket Freaks (@CricFreaks09) July 31, 2022 The best type of morning #family pic.twitter.com/SJYQMoG8pj — Pat Cummins (@patcummins30) July 20, 2022 Good to be home #australia pic.twitter.com/UHrULebelx — Pat Cummins (@patcummins30) July 15, 2022 Meanwhile, back home.. pic.twitter.com/AaTTHCTe76 — Pat Cummins (@patcummins30) June 19, 2022 Happy Mother’s Day to all the Mums out there. You all inspire us everyday ❤️ pic.twitter.com/APXQ1fRFkn — Pat Cummins (@patcummins30) May 8, 2022