ప్రస్తుతం ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్ లో 95 సంవత్సరాల బామ్మ స్వర్ణ పతకం గెలిచింది. అయితే ఈసారి గెలిచింది మాత్రం రన్నింగ్ లో కాదు. మరి ఈ సూపర్ బామ్మ ఏ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వయసు పైబడుతున్న కొద్ది మన పనులు మనం చేసుకోవడమే కష్టంగా మారుతుంటుంది. అలాంటిది ఈ 95 సంవత్సరాల బామ్మ వరల్డ్ వైడ్ గా గోల్డ్ మెడల్స్ కొల్లగొడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. గత సంవత్సరం ఫిన్లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది 95 ఏళ్ల భగ్వానీ దేవీ. తాజాగా మరోసారి గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచాన్ని అబ్బుర పరిచింది ఈ సూపర్ బామ్మ. ప్రస్తుతం ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం గెలిచింది. అయితే ఈసారి గెలిచింది మాత్రం రన్నింగ్ లో కాదు. మరి ఈ సూపర్ బామ్మ ఏ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
భగ్వానీ దేవీ దాగర్.. ఇప్పుడు ప్రపంచం మెుత్తం ఈ పేరు గురించే చర్చించుకుంటోంది. దానికి కారణం ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడమే. 95 సంవత్సరాల వయసులో బామ్మ ఈ ఫీట్ ను సాధించింది. అయితే గతంలో కూడా భగ్వానీ దేవీ ఇదే టోర్నీలో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించింది. కానీ ఈసారి గోల్డ్ మెడల్ కొట్టింది మాత్రం రన్నింగ్ లో కాదు. ఎందులో అంటే? ఫిన్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్ లో భాగంగా.. ఆదివారం జరిగిన డిస్క్ త్రోలో భగ్వానీ దేవీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో వరుసగా ఈ టోర్నీలో గోల్డ్ మెడల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది ఈ 95 ఏళ్ల బామ్మ.
ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. హర్యానాలోని ఖేడ్క అనే గ్రామంలో జన్మించింది భగ్వానీ దేవీ. 12 సంవత్సరాలకే పెళ్లి జరగడం, ఆ తర్వాత పిల్లలకు తల్లి కావడం, 30 ఏళ్లకు భర్తను, కొన్ని సంవత్సరాలకు ఇద్దరు పిల్లల్ని కోల్పోయి పుట్టెడు కష్టాలు అనుభవించింది. కాగా తన మనవడు వికాస్ డాగర్ పారా అథ్లెట్ గా గుర్తింపు పొందడమే కాకుండా ఖేల్ రత్న లాంటి పురస్కారాలు అందుకున్నాడు. తన బామ్మలో ఉన్న క్రీడా స్పూర్తిని గమనించిన వికాస్.. ఆమెకు ట్రైనింగ్ ఇచ్చాడు. దాంతో ఆమె గోల్డ్ మెడల్స్ మీద మెడల్స్ సాధిస్తూ.. దూసుకెళ్తోంది. మరి ఏజ్ జస్ట్ ఒక నెంబర్ అని ప్రూవ్ చేస్తోన్న ఈ సూపర్ బామ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.