ఐపీఎల్ 2022లో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో SRH 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. జవాబుగా సన్‌రైజర్స్ 17.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ నితీష్ రాణా ఏకంగా సన్‌రైజర్స్ డగౌట్‌లో ఉన్న రిఫ్రిజిరేటర్‌ను బద్దలుకొట్టాడు.
కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో సన్‌రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని రాణా ఫైన్‌లెగ్ వైపు సూపర్ షాట్ ఆడాడు. అది కాస్తా.. బుల్లెట్ వేగంతో వెళ్లి సన్‌రైజర్స్ హైదరాబాద్ డగౌట్‌లోని రిఫ్రిజిరేటర్ గ్లాస్ డోర్‌ను పలగొట్టింది. బంతి వచ్చిన వేగానికి ఆ భారీ గ్లాస్ పగిలిపోవడంతో.. ప్రస్తుతం రాణా కొట్టిన షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో రాణా మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 54 పరుగులు చేశాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోవడం రాణా హాఫ్ సెంచరీ వృథా అయింది. మరి రాణా ఆడిన షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వికెట్ తీయకుండా భారీగా పరుగులిచ్చినా.. ఉమ్రాన్ మాలిక్‌కు రూ.లక్ష ఇస్తున్నారు ఎందుకని..?
Nitish Rana broke the fridge 😂 pic.twitter.com/sd7NRxiBWi
— Sohom ᴷᴷᴿ (@AwaaraHoon) April 15, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.