ఐపీఎల్ పదహారో సీజన్‌తో స్టార్డమ్ సంపాదించిన క్రికెటర్లలో రింకూ సింగ్ ఒకడు. అతడి పించ్ హిట్టింగ్, భారీ సిక్సులకు అందరూ ఫిదా అయ్యారు. అలాంటి రింకూ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన కోల్‌కతా నైట్‌రైడర్స్ మరోమారు తమ అభిమానులను నిరాశపర్చింది. వరుసగా రెండో సీజన్లోనూ ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించింది. గతేడాది ఐపీఎల్లో ఏడో స్థానంతో ఫినిష్ చేసిన కేకేఆర్.. పదహారో సీజన్‌ను కూడా అదే ప్లేస్‌తో తమ ప్రయాణాన్ని ముగించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ చివరి మ్యాచ్ ఆడింది కోల్‌కతా. ఇందులో లక్నో గెలిచినప్పటికీ కేకేఆర్ ఆటతీరును అందరూ మెచ్చుకున్నారు. ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్‌కు కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 8 వికెట్లకు 176 రన్స్ చేసింది. లక్ష్య ఛేధనలో కేకేఆర్ చతికిలపడింది. కేవలం ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది. అయితే ఆఖరి వరకు టీమ్ విజయం కోసం పోరాడిన రింకూ సింగ్ (67) అందరి మనసులు గెలుచుకున్నాడు. రింకూ ఎంత ఫైట్ చేసినా కేకేఆర్‌ను విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
ఈ ఐపీఎల్లో పలు అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్‌కు లక్నోపై మ్యాచ్ ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్ వివాదంతో ఫేమస్ అయిన పేసర్ నవీన్ ఉల్ హక్కు ఈ మ్యాచ్‌లో రింకూ పోయించాడు. అతడి బౌలింగ్‌లో ఏకంగా 110 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. ఇదిలా ఉండగా.. లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయినప్పటికీ రింకూ తన ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. కోల్‌కతా కెప్టెన్ నితీష్ రానా భార్య సాచీ మార్వాతో కలసి రింకూ సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా రింకూ, సాచీలు కలసి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో రింకూ మామూలోడు కాదు, ఏకంగా కెప్టెన్ భార్యతో ఇంత సన్నిహితంగా ఉంటున్నాడేంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే వారికి తెలియని విషయమేంటంటే.. నితీష్ రానా భార్య సాచీ, రింకూలు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. కాబట్టి ఇద్దరు మిత్రులు దిగిన ఫొటోగానే దీన్ని చూడాలని రింకూ ఫ్యాన్స్ అంటున్నారు.
Raja Rinku Singh story with Captain’s wife 🥵 pic.twitter.com/xEvJD181Mh
— CS Rishabh (Professor) (@ProfesorSahab) May 21, 2023