దేశ రాజధాని ఢిల్లీలో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో భారత క్రికెటర్ భార్య కారును వెంబడిస్తూ ఆమెను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. గట్టిగా అరుస్తూ.. కారును ఢీకొట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
భారత యువ క్రికెటర్, ప్రస్తుత కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సారథి నితీశ్ రాణా భార్యకు చేదు అనుభవం ఎదురైంది. రాణా భార్య సాచీ మార్వా కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు పోకిరీలు ఆమె కారును వెంబడించారు. ఆపై ఉద్దేశపూర్వకంగా కారును పలుమార్లు ఢీకొట్టారు. రాత్రి సమయం కావడం, పోకిరీలు రాడ్డు పట్టుకొని కారును వెంబడించడంతో ఆమె తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని కీర్తినగర్ లో చోటుచేసుకుంది.
ఈ నెల 4వ తేదీన సాచీ మార్వా పనిమీద బయటకి వెళ్ళింది. ఆ పని ముగిసాక ఆమె తిరిగి రాత్రి కారులో ఇంటికి బయలుదేరి వెళ్తుండగా.. ఢిల్లీలోని కీర్తినగర్ ఏరియాలో ఇద్దరు యువకులకు బైక్‌పై వెంబడించారు. కారును అడ్డుకోవడానికి పదేపదే ప్రయత్నించారు. ఆపై ఉద్దేశపూర్వకంగా కారును పలుమార్లు ఢీకొట్టారు. గట్టిగా అరుస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పాటు వారు సాచి మార్వా కారును వెంబడించినట్లు తెలుస్తోంది. అందుకు కారకులైన యువకుల ఫొటో తీసిన మార్వ.. తనకు ఎదురైన అనుభవాన్ని తరువాత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణను మార్వా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వివరించారు. “నేను నా పనిపూర్తి చేసుకొని కారులో ఇంటికి బయలుదేరాను. కానీ ఉన్నట్టుండి ఈ ఫొటోలో ఉన్న యువకులు ఉద్దేశ్యపూర్వకంగా నా కారును వెంబడించారు. కారణం లేకుండానే ఢీకొట్టడం మొదలుపెట్టారు. వీరి చర్యల పట్ల నేను చాలా ఇబ్బందిపడ్డా..” అని మార్వా రాసుకొచ్చింది. అలాగే ఈ విషయం పోలీసులకు చెబితే వాళ్లు తేలికగా చాలా తీసుకున్నారని అందులో చెప్పారు. మీరు ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు కాబట్టి.. ఇక దానిని మర్చిపోమని చెప్పారని తెలిపారు. ఇంకోసారి అలాంటి సందర్భం ఎదురైతే వెహికల్ నంబర్‌ను నోట్ చేసుకోవాలని వారు సలహా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోకిరీల అటకట్టించాల్సిన పోలీసులు ఇలాంటి సలహాలు ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
#Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana’s wife’s car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police
Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv
— UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023
Just saw Nitish Rana’s wife’s Instagram stories (Saachi Marwah). Two men hit her car and followed her and Delhi police to her to leave it since they left??? This is so unacceptable! pic.twitter.com/UMQwB92xWo
— PS ⚡️ (@Neelaasapphire) May 5, 2023