వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు 5 టీ 20 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే టెస్టు, వన్డే కి సంబంధించిన జట్టుని ప్రకటించగా.. నిన్న 5 మందితో కూడిన టీ 20 జట్టుని ప్రకటించేశారు. అయితే ఈ సారైనా చోటు దక్కుతుందని ఆశించిన నితీష్ రానాకీ మరోసారి దురదృష్టం వెక్కిరించింది.
టాలెంట్ ఉన్నా ఇండియన్ క్రికెట్ లో ప్లేస్ సంపాదించడం అంత సామాన్యమైన విషయం కాదు. దేశంలో క్రికెట్ కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవాళీ, ఐపీఎల్ లాంటి టోర్నీల్లో నిరూపించుకున్నప్పటికీ భారత క్రికెట్ లో అడుగుపెట్టడం అంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. విపరీతమైన కాంపిటీషన్ వల్ల కొంతమంది ఇప్పటికీ అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టలేకపోతున్నారు. ఈ లిస్టులో ఢిల్లీ కుర్రాడు నితీష్ రానా కూడా ఉన్నాడు. తాజాగా వెస్టిండీస్ తో ప్రకటించిన జట్టులో మరోసారి ఛాన్స్ దక్కలేదు. దీంతో ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు 5 టీ 20 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే టెస్టు, వన్డే కి సంబంధించిన జట్టుని ప్రకటించగా.. నిన్న 5 మందితో కూడిన టీ 20 జట్టుని ప్రకటించేశారు. ఆగస్టు మూడు నుండి 13 వరకు 5 టీ 20 ల సిరీస్ జరగనుంది. ఇక భారత జట్టులో ఎప్పటిలాగే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వగా జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండిపోయింది. ఇక ఈ జట్టని కెప్టెన్ హార్దిక్ పాండ్య నడిపించనున్నాడు. ఇదిలా ఉండగా ఈ స్క్వాడ్ లో తొలిసారి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చోటు సంపాదించాడు. అంతే కాదు యశస్వి జైస్వాల్ ఇటీవలే టెస్టులకి ఎంపికైన యశస్వి జైస్వాల్ టీ 20 ల్లో కూడా చోటు సంపాదించాడు.
అయితే ఈ సారైనా చోటు దక్కుతుందని ఆశించిన నితీష్ రానాకీ మరోసారి దురదృష్టం వెక్కిరించింది. దీంతో ఇంస్టాగ్రామ్ లో “మన జీవితంలో మంచి రోజులని చెడ్డ రోజులే నిర్మిస్తాయి”. అనే పాజిటీవ్ కొటేషన్ పెట్టి తనను తాను మోటివేట్ చేసుకున్నాడు. దీంతో టీమిండియాలోకి మరింత కష్టపడి వస్తానని నితీష్ రానా తెలియజేశాడు. ఐపీఎల్ లో నితీష్ రానా కోల్ కత్తా జట్టుకి కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్న నితీష్ రానా దేశవాలీ క్రికెట్ లో కూడా రాణించాడు. అయినా కానీ సెలక్టర్లు ఈ లెఫ్ట్ హ్యాండర్ పక్కన పెట్టేస్తున్నారు. మరి భవిష్యత్తులో మరింతగా రాటుదేలి ఇండియన్ క్రికెట్ లో స్థానం సంపాదించుకుంటాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.