క్రికెటర్లు అనగానే వారికి మాత్రమే కాదు.. వారి ఫ్యామిలీకి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. సెలబ్రిటీల తరహాలోనే క్రికెటర్ల కుటుంబసభ్యులకు కూడా కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటనే కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా భార్యకు ఎదురైంది.
సాధారణంగానే క్రికెటర్లకు మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీకి కూడా జనాల్లో ఫాలోయింగ్ ఉంటుంది. క్రికెటర్ల భార్యలు, పిల్లలు పబ్లిక్ ప్లేసెస్ లో కనిపిస్తే ఫొటోల కోసం ఎగబడటం, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించడం చేస్తుంటారు. కొన్నిసార్లు అవి మంచిగానే సాగినా.. కొన్నిసార్లు మాత్రం చేదు అనుభవాన్ని మిగులుస్తూ ఉంటాయి. అలాంటి ఒక అనుభవమే ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా సతీమణి సాచి మర్వా రాణికి ఎదురైంది. ఆమెకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. వెంటనే ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియో, వివరాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. దేశ రాజధాని ఢిల్లీలో సాచీ మర్వా ప్రయాణిస్తున్న కారుని ఇద్దరు యువకులు వెంబడించారు. వారు ఉద్దేశపూర్వకంగానే సాచీ ప్రయాణిస్తున్న కారుని పలుమార్లు ఢీకొట్టారు. అయితే వారి ప్రవర్తనతో భయాందోళనకు గురైన సాచీ మర్వా ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు స్పందించిన తీరు సాచీని బాధ పెట్టింది. మీరు క్షేమంగా ఇంటికి వెళ్లారు కదా.. ఈసారి ఇలా జరిగితే నంబర్ నోట్ చేసుకోండని చెప్పారట. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చి తాను షూట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఢిల్లీ పోలీస్ ని ట్యాగ్ చేస్తూ ఈసారి వారి ఫోన్ నంబర్ కూడా తీసుకుంటాను అంటూ ఎద్దేవా చేసింది.
తర్వాత మరో స్టోరీ ద్వారా ఆ యువకులను పట్టుకున్నట్లు సాచీ మర్వా రాణా వెల్లడించింది. ఢిల్లీ పోలీసులకు థాంక్స్ కూడా చెప్పింది. అయితే ఆ యువకులు ఏదో అత్యుత్సాహంతో అలా చేశారని తెలిసినట్లు వివరించారు. అసలే స్కూల్ పిల్లలు కాబట్టి వారిని కాస్త స్మూత్ గా డీల్ చేయాలంటూ సాచీ కోరింది. కేసులు పెట్టి వారి జీవితాన్ని నాశనం చేయకండని సాచీ కోరినట్లు తెలుస్తోంది. అలాగే తన రక్షణ గురించి కంగారు పడిన ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. తనని ఇబ్బంది పెట్టారని తెలిసి కూడా వారిని వదిలేయాలంటూ కోరడంపై నితీశ్ రాణా భార్య సాచీ మర్వా రాణాపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
#Watch: 2 men stalk & chase #KKR captain Nitish Rana’s wife’s car in #Delhi, she shares #video#NitishRana #SaachiMarwah #viral #news #Police
Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/IxYAdGZyrv
— UnMuteINDIA (@LetsUnMuteIndia) May 6, 2023