‘ఎంతటి బలమైన రాజు అయినా బలహీనమైన సైనికులతో యుద్దం గెలవలేడు‘. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మది ఇదే పరిస్థితి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీనంతటికీ కారణం.. కేకేఆర్ బ్యాట్స్‌మన్ పాట్ కమిన్స్. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న కమిన్స్ ఎంట్రీతోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోసిన కమిన్స్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి కేకేఆర్ 162 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు ఓవర్లు ఉండగానే అందుకుంది.
రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అవ్వొచ్చు.. కానీ, మ్యాచ్ గెలవాలంటే అదొక్కటే సరిపోదు. జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లు అంతో ఇంతో రాణించాలి. అలాంటప్పుడే జట్టు విజయాలు నమోదు చేయగలదు. అయితే సరైన ఆటగాళ్లు లేకుంటే ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా ఏం చేయలేడు. మెగా వేలంలో సరైన బౌలర్లను తీసుకోవడంలో ముంబై విఫలమైంది. ఇతర జట్లు పెద్దగా ఆసక్తి చూపని డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్‌లను తీసుకొంది. వీరు రాణించడం పక్కనపెడితే.. 20 ఓవర్లలో ప్రత్యర్థి టీం చేసిన స్కోర్ కాస్తా.. వీరి 12 ఓవర్లకే సరిపోతోంది. ఇక.. డానియల్ సామ్స్ అయితే.. వరుస అర్ధ సెంచరీలతో దూసుకుపోతున్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2022: మరో చెత్త రికార్డు మూటగట్టుకున్న ముంబై బౌలర్
అయితే.. ఈ ముగ్గురి క్రికెటర్లపై ట్విట్టర్లో పెద్ద చర్చ జరుగుతోంది. డానియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్‌ను వదులుకొని.. ఆర్‌సీబీ మంచి నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో.. ముంబై వీరు ముగ్గురుని తీసుకొని ఘోర తప్పిదం చేసిందని విమర్శిస్తున్నారు. నువ్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చావనుకో.. నేను 40 ఇస్తా..! నువ్ 40 ఇచ్చావనుకో.. నేను 50 ఇస్తా అన్న రీతిలో బౌలింగ్ వేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ముగురూ.. ముగ్గురే.. తగ్గేదేలే అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్ కారణంగా బుమ్రాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
KKR move to the top of the #IPL2022 points table with their win over MI last night
es,pn/IPL22Table pic.twitter.com/3oWtElnmrF
— ESPNcricinfo (@ESPNcricinfo) April 7, 2022
అయితే,.. గతంలో వరుసగా 5, 6 మ్యాచ్‌లు ఓడినా కూడా ముంబై టైటిల్ గెలిచింది. కాబట్టి ఆశలు వదులుకోకుండా పోరాడాలి. అయితే ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉన్నదనే విషయం వాస్తవం. అయితే గత సీజన్‌లో 6, 7 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. కానీ ఈసారి 8 నుంచి 9 మ్యాచ్‌లు గెలిచినా టాప్ 4లో నిలవడం కష్టం. మరి ఇలాంటి తరుణంలో ముంబై ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
🔴Apart from Jasprit Bumrah, this one of the weakest attack in #IPL2022 , Look all bowling attacks and compare with Mumbai indians . #RohitSharma #IPL #mivskkr #KKRvMI #KKR #mi pic.twitter.com/DNjsCvJ6Qz
— Syed Umaiyd (@SyedUmaiyd) April 6, 2022
ఇది కూడా చదవండి: కమిన్స్‌పై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు నమ్మకం లేదు