ముక్కు అవినాష్ తాజాగా కొత్త కారు ఒకటి కొనుగోలు చేశారు. అయితే ఆ కారు కొనడానికి డబ్బులు ఎక్కడివి.. అలా సంపాదించిన డబ్బులతోనే కదా కొన్నావ్ అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అవుతున్నారు. స్టార్స్‌గా వెలుగుతున్నారు. షోలు చేస్తునే.. మరో పక్క యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. బయట ఈవెంట్స్ లో పాల్గొంటూ.. లక్షలు సంపాదిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే సొంతంగా ఇల్లు, కార్లు కూడా కొనుక్కున్నారు కూడా. వారిలో ముక్కు అవినాష్ ఒకరు. ముక్కు అవినాష్ జబర్దస్త్ షో ద్వారా పరిచమయ్యారు. తన దైన పంచులతో, కామెడీ స్కిట్లతో జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నారు. తన మిమిక్రీతో సాయి కూమార్ వాయిస్‌ని ఉన్నదున్నట్టు దించేయడంలో అవినాష్ దిట్ట. ఈ మధ్య బిగ్ బాస్ షోకి వెళ్లి అక్కడ కూడా నవ్వులు పూయించారు. ఇకపోతే తాజాగా అవినాష్ భార్య అనుజ ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సంగతి తెలిసిందే. తను తండ్రి కాబోతున్నాడని ఆనందించే లోపే.. తన తల్లి మల్లమ్మ ఆనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు.
ఇటీవలే అవినాష్ తల్లికి స్టంట్లు పడ్డాయి. ఈ విషయాన్ని అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. ఈ సమయంలోనే అవినాష్ కొత్త కారు కొన్నారు. తన పాత కార్ యాక్సిడెంట్ అయ్యిందని, అది ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త కారు కొన్నట్లు వెల్లడించారు. ఈ కారు ధర దాదాపు రూ. 25 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ కారును పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశారు. చాలా మంది తన ఫాలోవర్స్ అతనికి శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు మాత్రం అవినాష్ ని విమర్శిస్తున్నారు. ఓ పక్క అమ్మకు ఆరోగ్యం మంచిగా లేక బాధపడుతుంటే, కారు తీసుకోవడం అవసరమా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘మొన్న మీ అమ్మ గారికి ఆరోగ్యం బాగాలేక వీడియో తీశావ్.. ఆ వీడియో డబ్బులతో అప్పుడే కొత్త కారు కొన్నావా? మంచి మంచి కట్టుబాట్లు మీకు’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘మొన్న మీ అమ్మకి బాలేదని వీడియో పెట్టినావు గా అన్న.. ఆ డబ్బుతోనే ఈ కారు కొన్నావా’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. అయితే ముక్కు అవినాష్ కి మద్దతుగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కారు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు కదా.. దాన్ని ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త కారు తీసుకుంటే తప్పేంటి? అని అవినాష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈరోజుల్లో సెలబ్రిటీలకు కారు అనేది చాలా అవసరం. ఆ మాత్రం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.