ఐపీఎల్ 2022లో నేడు(సోమవారం) ఆసక్తికర పోరు జరగనుంది. ఈ ఏడాది రిచ్ లీగ్‌లోకి ప్రవేశించిన రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా ఐపీఎల్‌లో మొదటిసారి పాల్గొంటోన్న ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలను ఒకసారి పరిశీలిద్దాం..
లక్నో సూపర్ జెయింట్స్..
ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. అతనికి తోడుగా దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్‌కు డికాక్‌లు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా అనుమానంగానే ఉంది. అలాగే మనీష్ పాండే, ఎవిన్ లూయిస్ రూపంలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇక అవసరమైన సమయాల్లో బ్యాట్ ఝుళిపించేందుకు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే ప్రారంభ మ్యాచ్‌లకు విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ లేకపోవడం లక్నోకు లోటే అని చెప్పవచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన స్టార్ పేసర్ అవేష్ ఖాన్‌పైనే రాహుల్ సేన ఆశలు పెట్టుకుంది. అతనికి మద్దతుగా దుష్మంత చమీర్, రవి బిష్ణోయ్, షాబాజ్ నదీమ్ స్పిన్ భారాన్ని మోయనున్నారు.
గుజరాత్ టైటాన్స్..
ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ఉన్నాడు. ఈ ఫ్రాంఛైజీ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను పెద్దగా తీసుకోలేదు. టోర్నీకి ముందే జాసన్ రాయ్ తప్పుకోవడం జీటీకి భారీ షాకే. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహాలపైనే ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌లో పెద్దగా స్టార్లు లేని గుజరాత్‌లో బౌలింగ్ మాత్రం దుర్భేద్యంగా ఉంది. మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్ లాంటి పేస్‌బౌలర్లతో పాటు రషీద్ ఖాన్ లాంటి స్పిన్ దిగ్గజం ఆ జట్టులో ఉండడం కొండంత బలం. వారికి మద్దతుగా R సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్ వంటి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు.
పిచ్..
ఈ మ్యాచ్ ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదు కావచ్చు
ఇలా ఇరు జట్ల బలాబలాలు అంచనా వేసిన తర్వాత ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తెలిచే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా.. లక్నోను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకునే బౌలింగ్ ఎటాక్ గుజరాత్ సొంతం. టైటాన్స్ బౌలర్లు తమ స్థాయి మేర రాణిస్తే విజయం చాలా ఈజీగా అందుతుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తుది జట్ల అంచనా..
లక్నో సూపర్ జెయింట్స్- కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్నన్ హోరా, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనల్ పాండ్యా, కిృష్ణప్ప గౌతమ్, దుష్మంత్ చమీరా, అకింత్ రాజ్‌పుత్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
గుజరాత్ టైటాన్స్ – హార్థిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, మ్యాథ్యూ వేడ్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, వరణ్ అరోణ్, రషీద్ ఖాన్, మొహ్మమద్ షమీ, ఫెర్గూసన్.
5. Lucknow supergiants
🔍 Related Searches: gujarat titans team, lucknow super giants
📊 Detailed Stats: https://t.co/bkfQ0HpMna
📰 News Related:
Cricket Addictor: Gujarat Titans vs Lucknow Super Giants Match Preview- IPL 2022 …https://t.co/qFbTSwER7V— 🇮🇳 India Google Trends (@24TrendsIndia) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.