ఐపీఎల్ 2022 ఎడిషన్ మొదలు కావడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాశాయి. లీగ్ లో ఎలా రాణించాలన్న దానిపై ఇప్పటికే వ్యూహరచనలు చేస్తున్నాయి. ఈ ఏడాది కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడంతో లీగ్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఈ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై.. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్-2021లో కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. ఓపెనర్‌గా వచ్చినప్పటికీ చాల మ్యాచుల్లో విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 405 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్ లో లాగా ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోహ్లిపై మరింత బాధ్యత ఉంటుందని తెలిపాడు. “గత సీజన్‌లో కోహ్లి ఓపెనర్ గా వచ్చినపుడు.. మూడో స్దానం కోసం మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడారు. శ్రీకర్ భరత్ కొన్ని మ్యాచ్‌లకు మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రాగా.. కొన్ని మ్యాచ్‌ల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ వచ్చేవాడు.
ఇది కూడా చదవండి: కటిక నేలపై పడుకున్న విరాట్ కోహ్లీ! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారుగత సీజన్ లో లాగా ప్రయోగాలు చేయకుండా.. కీలకమైన ఆటగాళ్లను ముందు బ్యాటింగ్‌కు పంపాలి. ఈ ఏడాది జట్టు కష్టాలలో ఉన్నపుడు ఆదుకునే.. ఏబీ కూడా లేడు. అతడు జట్టులో ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే,.. అతని స్థానంలో దినేష్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. కానీ అతడి స్ధానాన్ని కార్తీక్ భర్తీ చేయలేడు. ఫస్ట్ డౌన్‌లో ఒక స్ధిరమైన ఆటగాడు కావాలి. కోహ్లీ అందుకు బెస్ట్ బ్యాటర్.. అందరూ కోహ్లీని 14, 15 ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తే జట్టుకు చాలా ఉపయోగపడుతుంది” అని చోప్రా పేర్కొన్నాడు.
At what position should Virat Kohli bat for RCB in IPL 2022? 🤔
📸IPL#IPL #IPL2022 pic.twitter.com/6T6y6exExc
— Sportskeeda (@Sportskeeda) March 19, 2022
It was the first time we got to see Chris Gayle, Virat Kohli & AB de Villiers playing for the same team and a season that will be remembered for some thrilling and nail-biting encounters. 🔥🤩#PlayBold #WeAreChallengers #IPL2022 pic.twitter.com/Rb8P8fngKK
— Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2022
“I absolutely love it and the moment I wore it, I felt something special. I can definitely say, this is my most favourite RCB jersey, EVER!” 🤩
King Kohli loves the new #RCBJersey for #IPL2022 and so do we!❤️@imVkohli #PlayBold #RCBUnbox #UnboxTheBold #ForOur12thMan #IPL2022 pic.twitter.com/hIuLquniHh
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022