‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా-2021’లో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టీ20 నవంబరు 19న రాంచీ వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ను వాయిదా వేయాలంటూ ఝార్ఖండ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. లాయర్ ధీరజ్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వంద శాతం ప్రేక్షకులతో మ్యాచ్ నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వందశాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారంటూ గురవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రంలో థియేటర్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లలో 50 మేర మాత్రమే అనుమతించాలి అన్నప్పుడు.. వంద శాతం సీటింగ్‌కు అనుమతివ్వడం సరైన నిర్ణయం కాదంటూ అభిప్రాయపడ్డారు.
మ్యాచ్ ను అయితే 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలి. లేదంటే మ్యాచ్ ను వాయిదా వేయాలంటూ న్యాయమూర్తి ధీరజ్ కుమార్ కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో 50 శాతం మేర మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి వంద శాతం సీటింగ్ కు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.