బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. దాంతో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది ప్రత్యర్థి టీమ్. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్-షమీ మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-భారత్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఇక తొలి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా అదే జోరును రెండో టెస్ట్ లోనూ చూపించింది. మరోసారి టీమిండియా బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే తొలిరోజే ఆలౌట్ అయ్యింది ప్రత్యర్థి జట్టు. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో ఆసిస్ బ్యాటర్ల భరతం పట్టాడు. మరోవైపు స్పిన్నర్లు సైతం తమ మణికట్టు మాయాజాలం చేశారు. ఇక ఆసిస్ ఇన్నింగ్స్ చివర్లో అశ్విన్-షమీ మధ్య ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చెలరేగిపోతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో గెలిచి సిరీస్ లో ముందంజలో ఉన్న భారత జట్టు.. రెండో టెస్ట్ లో కూడా విజృంభించింది. తొలి రోజే ఆసిస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసి పై చేయి సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి 263 పరుగులకే ఆసిస్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా టీమ్ లో ఖవాజా(81), హ్యండ్స్ కాంబ్ 72* పరుగులతో రాణించారు. మిగతా వారిలో ఏ ఒక్కరు కూడా పెద్దగా రాణించలేదు. ఇక టీమిండియా బౌలర్లలో స్టార్ పేసర్ మహ్మద్ షమీ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు తలా మూడేసి వికెట్లను నేలకూల్చారు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్-షమీ మధ్య ఓ సరదా సన్నివేశం జరిగింది. ఆసిస్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 74వ ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఓవర్ లో ఆసిస్ బ్యాటర్ నాథన్ లయోన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ. అనంతరం సంబరాలు జరుపుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ సంబరాల్లో షమీ తన సహచర ఆటగాళ్లతో సంతోషం పంచుకుంటుండగా.. మరో బౌలర్ అశ్విన్, షమీ చెవులను వెనక నుంచి గట్టిగా పిండాడు. దాంతో బాధతో, కోపంతో వెనక్కి తిరిగాడు షమీ. తన వెనక ఉన్న అశ్విన్ ను చూసి నవ్వులు చిందించాడు షమీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే వికెట్లు తీసినప్పుడు ఆటగాళ్లు ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఒకరిమీద ఒకరు పడటం, ఎత్తుకోవడం లాంటివి చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా అశ్విన్ సరదాగా షమీ చెవులు పిండాడు. ఇక ప్రస్తుతం టీమిండియా 9 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ(13), కేఎల్ రాహుల్(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
— Hardin (@hardintessa143) February 17, 2023