టీమిండియా క్రికెటర్లు పవిత్రమైన అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించి.. స్వామివారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు ఆలయం బయట పట్టువస్త్రాల్లో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామివారిని దర్శించుకున్న వారిలో సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వారితో పాటు మరికొంతమంది శ్రీలంక ఆటగాళ్లు సైతం స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంతో విశిష్టత గల పద్మనాభ స్వామి ఆలయ సందర్శన కోసం వచ్చిన క్రికెటర్లును ఆలయ కమిటీ సాదరంగా ఆహ్వానించి.. దగ్గరుండి ఆలయ సందర్శనతో పాటు స్వామి వారి దర్శనం చేయించింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో వన్డే తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అక్కడి వచ్చిన ఇరు జట్లు.. దగ్గర్లోని పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. కాగా.. టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన లంక.. టీ20 సిరీస్‌ను 1-2తో తేడాతో ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా.. శ్రీలంకను ఓడించి టీ20 సిరీస్‌ను గెలిచింది. ఆ తర్వాత ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్‌తో టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ తిరిగి టీమ్‌లోకి వచ్చారు. వన్డే సిరీస్‌ను కూడా టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత.. శ్రీలంక కూడా అద్భుతంగా పోరాటం చేసినా.. లక్ష్యం చేరుకోలేకపోయింది. లంక కెప్టెన్ షనక సెంచరీతో రాణించాడు. ఒక రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగి పోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంకను 215 ఆలౌట్ చేశారు. సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లతో రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా టాపార్డర్ విఫలమైనా.. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించారు. ఇక ఆదివారం తిరువనంతపురంలో జరిగిన ఆఖరి వన్డేతో శ్రీలంక పర్యటన ముగుస్తుంది. మరి ఆ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంటే.. చివరి వన్డేలోనైనా గెలిచి.. పరువుతో స్వదేశం చేరుకోవాలని లంక పట్టుదలతో ఉంది. మరి మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా.. ఆటగాళ్లు పద్మనాభ స్వామివారిని దర్శించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian players visited Padmanabhaswamy Temple at Trivandrum. pic.twitter.com/S21VxIyGAh
— Johns. (@CricCrazyJohns) January 14, 2023