గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి పరాజయం పాలైంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(108) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అయితే.. ఈ మ్యాచులో భారత బౌలర్ మహమ్మద్ షమీ చేసిన ఒక పని అతనిని విమర్శల పాలు చేస్తోంది. క్రీడాస్ఫూర్తి పాటించవా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
374 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభం కలిసి రాలేదు. 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన లంక.. 23 పరుగుల వద్ద రెండో వికెట్, 64 పరుగుల వద్ద మూడో వికెట్.. ఇలా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(108) మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. సహచరులందరూ ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా అతడు మాత్రం భారత బౌలర్లను ఎదురొడ్డి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.
అయితే.. ఆఖరి ఓవర్ లో షనక సెంచరీకి 5 పరుగులు అవసరం కాగా, మొదటి బంతికి 2, రెండో బంతి డాట్, మూడో బంతికి సింగిల్ వచ్చింది. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న షనక, నాలుగో బంతికి సింగిల్ తీసుకుందామన్న ఉద్దేశ్యంతో షమీ బాల్ వేయకముందే క్రీజు దాటాడు. దీంతో షమీ మన్కడింగ్ చేశాడు. వెంటనే అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా, టీమిండియా సారధి రోహిత్ శర్మ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. షమీకి ఏదో చెప్పడంతో అతను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అనంతరం ఫోర్ బాధి షనక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ రోహిత్ ఎంట్రీ ఇవ్వడం షమీ పరువు నిలబెట్టిందని చెప్పాలి. అప్పటికే.. ‘అభిమానులు షమీ నీ క్రీడాస్ఫూర్తి ఇదేనా..’ అంటూ విమర్శలు గుప్పించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. షమీ చేసింది తప్పా..? ఒప్పా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ShamiMankad pic.twitter.com/hiXdiyONEw
— Sekhar Rambo (@RamboSekhar) January 10, 2023