ఇండియా-న్యూజిల్యాండ్ పోరుకు సమయం ఆసన్నమైంది. జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇరు జట్లు అమీ- తుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డేల సిరీస్ నెగ్గి టీమిండియా జోరు మీదుండగా.. పాక్ గడ్డపై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచి కివీస్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే.. కేన్ విలియంసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం కివీస్ కు లోటే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న కివీస్ సారథి టామ్ లాథమ్, భారత్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ పిచ్‌లు పాక్ తరహాలో ఉంటాయన్న లాథమ్, పాక్ గడ్డపై వారిని 2-1 తేడాతో ఓడించిన విషయాన్ని ప్రస్తావించాడు.
మ్యాచుకు ముందు ఇరు జట్ల సారధులు.. జట్ల బలాబలాలపై, వ్యూహాలపై మీడియాతో ముచ్చటించడం మాములే. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టు గురుంచి మాట్లాడితే, కివీస్ సారథి టామ్ లాథమ్ భారత్ ను ఓడించగలమన్న ధీమాతో మాట్లాడాడు. ఐపీఎల్ ఆడిన అనుభవం దృష్ట్యా తమ ఆటగాళ్లకు కలిసొస్తుందన్న కివీస్ సారధి, భారత ఆటగాళ్లు ఆటతీరు ఎలా ఉంటదో తమకు తెలుసని అన్నాడు. “ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. కాబట్టి ఈ సిరీస్ గెలవడం మాకు చాలా ముఖ్యం. విలియమ్సన్, టిమ్ సౌథీ అందుబాటులో లేకపోవడం లోటే అయినా.. ఈ నిర్ణయం వల్ల యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఇది కూడా ఒకందుకు మంచిదే..
ఇటీవల పాక్ గడ్డపై వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచాం. అక్కడ కూడా భారత్‌లో మాదిరిగానే వాతావరణ పరిస్థితులున్నాయి. అదే మాకు కలిసొచ్చింది. ఇండియాలో పిచ్‌లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా రాణించే జట్టు మాతో ఉంది. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు, మేం కలిసే ఆడాం. కాబట్టి.. ఎవరి ఆటతీరు ఏంటో మాకు తెలుసు.. ఈ సిరీస్ నెగ్గగలమన్న ధీమాతో ఉన్నాం..” అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
Hello Hyderabad! First training of the India Tour ahead of ODI 1 on Wednesday. #INDvNZ pic.twitter.com/MR55MZrvyE
— BLACKCAPS (@BLACKCAPS) January 16, 2023
ఇక రోహిత్ మాట్లాడుతూ.. “న్యూజిలాండ్ బలమైన జట్టు. మా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశం. సిరాజ్ బాగా ఆడుతున్నాడు. కొత్త బంతితో వికెట్లు తీస్తున్నాడు. తొలిసారి హోమ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కి ఆల్ ది బెస్ట్. ఇక వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పిస్తాం. అలాగే ప్రత్యర్థి జట్టు ఎలా ఆడుతుందో అని అతిగా ఆలోచించకుండా మా శక్తి సామర్థ్యాలపై దృష్టిపెడతాం..” అని రోహిత్ శర్మ తెలిపాడు. ఇరుజట్ల మధ్య బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
At Hyderabad uppal Cricket stadium 🔥
18th match ki Ready..
All the best @BCCI and king @imVkohli 🔥 #INDvsNZ pic.twitter.com/3J1CoZV06H— Virat Akhil Hari (@ViratAkhilHari8) January 14, 2023