భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా బౌలర్ దీప్తి శర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ రనౌట్ ద్వారా అవుట్ చేసిన విషయం తెలిసిందే. ఆ రనౌట్‌పై ఇంగ్లండ్ క్రికెటర్లు అతిగా స్పందించడంతో వివాదాస్పదంగా మారింది. చార్లీ డీన్‌ను అంతకుముందే కొన్ని సార్లు వారించినా ఆమె అలానే చేస్తుండటంతో అంపైర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతే రనౌట్ చేసినట్లు దీప్తి శర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ కూడా ఆ రనౌట్‌పై వివరణ ఇచ్చాడు. అయినా మన్కడింగ్‌ను ఐసీసీ క్రికెట్ రూల్స్ లీగల్ చేసింది. అయినా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లు.. దీప్తి శర్మ ఏదో చేయరాని ఘోరం చేసినట్లు ట్వీట్లతో విమర్శలు చేశారు. ఆ తర్వాత.. తప్పు తనదే అని చార్లీ డీన్ ఒప్పుకుని, ఇక నుంచి క్రీజ్ వదలి వెళ్లనని చెప్పిన తర్వాత ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడింది.
కానీ.. తాజాగా ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ దీప్తి శర్మ పేరు వాడి.. మరోసారి మన్కడింగ్ వివాదాన్ని రాజేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరుగుతుంది. శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ నాలుగో బంతిని మలన్ డిఫెన్స్ ఆడగా.. ఆ బంతిని తీసుకున్న స్టార్క్ తిరిగి బౌలింగ్ వేసేందుకు వెళ్తూ.. బట్లర్ బాల్ రిలీజ్ కాకముందే క్రీజ్ వదిలి వెళ్తున్నాడని అంపైర్‌కు చెప్పాడు. పోతూపోతూ.. నేను దీప్తిని కాదులే కానీ.. అవుట్ చేయాలనిపిస్తుందంటూ.. బట్లర్‌కు చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయం మరో వివాదానికి కారణమైంది.
మన్కడింగ్ విషయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆలోచన ధోరణి ఒకేలా ఉందని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మన్కడింగ్‌ను లీగల్‌గా రనౌట్ అని చెప్తున్నా.. దాన్ని అనైతికమంటూ అతి చేస్తున్నారు. బాల్ రిలీజ్ కాకముందే క్రీజ్ వదిలి వెళ్లడం బాగా అలవాటు పడ్డ ఈ రెండు జట్లకు మన్కడింగ్ కచ్చితంగా మింగుడు పడదని క్రికెట్ అభిమానులు చురకలు అంటిస్తున్నారు. బ్యాట్ అడ్డుపెట్టి, బౌండరీలతో వరల్డ్ కప్ తీసుకున్న ఇంగ్లండ్, క్యాచ్ పట్టేందుకు వస్తున్న ఫీల్డర్‌ను కావాలనే ఆపి అవుట్ కాకుండా తప్పించుకున్న ఆస్ట్రేలియా లాంటి జట్లు దీప్తి శర్మ గురించి మాట్లాడం సిగ్గుచేటని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కాగా.. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలి టీ20 సందర్భంగా మార్క్‌వుడ్‌ను ఆసీస్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్ చేత్తో క్యాచ్ పట్టకుండాఅడ్డుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
SOUND 🔛
What do you think about this event between Mitchell Starc and @josbuttler? 🤔#JosButtler #MitchellStarc #AUSvENG #SonySportsNetwork pic.twitter.com/rA3D5yxwFP
— Sony Sports Network (@SonySportsNetwk) October 14, 2022