ఆస్ట్రేలియా వేదికగా మరి కొన్ని గంటల్లో టీ20 మహా సంగ్రామానికి తెరలేవనుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ వ్యూహాలతో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే టీమిండియా మాత్రం గాయాలతో సతమతమవుతూ ఉంది. అయినప్పటికీ భారత్ టైటిల్ ఫేవరెట్ అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాట్స్ మెన్ లపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ లే కీలకం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
సురేష్ రైనా.. ఐపీఎల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు సుదీర్ఘ కాలం సేవలు అందించి.. నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో రైనాని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో.. తన క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలోనే త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో భారత ప్రదర్శనపై తన అభిప్రాయాలను ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీతో పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ..”ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో.. టీమిండియాకు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లే కీలకంగా మారనున్నారు. ప్రస్తుతం వారిద్దరి ఫామ్ చూస్తూ భారత్ వరల్డ్ కప్ గెలవడం ఖాయం. అదేవిధంగా టీమిండియాకు విరాట్ కీలకంగా మారితే.. సూర్యకుమార్ మాత్రం గేమ్ ఛేంజర్ అవతారం ఎత్తుతాడు అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే టీమిండియా బౌలింగ్ దళం గాయాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. భువీ, అర్షదీప్, షమీ భారత్ కు మంచి ఆరంభాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను” అంటూ రైనా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
Suresh Raina expresses his opinion on Virat Kohli and Suryakumar Yadav.
#SureshRaina #ViratKohli #SuryakumarYadav #T20WorldCup #CricketTwitter pic.twitter.com/i4VgbMib2S
— CricTracker (@Cricketracker) October 14, 2022