‘ఐపీఎల్ 2022’ సందడి మొదలైంది. నవంబరు 30లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల వివరాలు ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. కొత్తగా రెండు టీమ్ లు వస్తున్న నేపథ్యంలో మెగా ఆక్షన్ కు ప్రాధాన్యత నెలకొంది. ప్రతి ఫ్రాంచైజ్ మ్యాక్సిమం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోగలదు. కొత్త ఫ్రాంచైజీలకు మాత్రం వేలానికి ముందే పూల్ లో ఉండే ముగ్గురు ఆటగాళ్లను నేరుగా కొనుగోలు చేసే వీలు కల్పించారు. వారికి పూల్ ఉండే ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా లక్నో ఫ్రాంచైజ్ ప్రవర్తిస్తోందనేది హైదరాబాద్, పంజాబ్ ఫ్రాంచైజీల ఆరోపణ.
లక్నో ఫ్రాంచైజీ రూల్స్ విరుద్ధంగా తమ ప్లేయర్లను అప్రోచ్ అవుతూ.. వారిని ప్రలోభాలకు గురిచేస్తోందనేది వారి ఆరోపణ. ఇదే విషయంపై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూల్ లో ఉండే ఆటగాళ్లను సంపద్రించే అవకాశం వారికి ఉంది. పౌచ్ లో ఉండే ఆటగాళ్లు అంటే ఇతర ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్లను సంప్రదించడం, వారికి ఆఫర్లు ఇవ్వడం నైతికం కాదు అని వారు ఆరోపిస్తున్నారు. బీసీసీఐ మాత్రం తమకు రిటన్ కంప్లైంట్ అందలేదని.. వెర్బల్ గా లక్నో ఇలా చేసిందని తెలిపినట్లు సమాచారం.
రాహుల్ పంజాబ్ జట్టు యాజమాన్యంతో అసంతృప్తిగా ఉన్నాడు. అని వచ్చిన వార్తలు నిజమేనని ఇప్పుడు తెలుస్తోంది. రషీద్ కూడా తనను ఫస్ట్ రిటైన్ ప్లేయర్ గా తీసుకోవాలని పట్టుబట్టినట్లు విన్నాం. తాజా విషయాలను గమనిస్తే అవన్నీ నిజమేనని అనుమానం రాకమానదు. మాములుగా అయితే రాహుల్ కు పంజాబ్ నుంచి రూ.11 కోట్లు, రషీద్ కు హైదరాబాద్ నుంచి రూ.9 కోట్లు వస్తాయి. కానీ, లక్నో టీమ్లు మారినందుకు భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ కు రూ.20 కోట్లు, రషీద్ ఖాన్ కు రూ.16 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నవంబరు 30 వరకు ఆటగాళ్లు కాంట్రాక్టులోనే ఉంటారు కాబట్టి లక్నో ఆ ప్రయత్నాలు చేసుంటే అది కచ్చితంగా అనైతికమే అవుతుంది. లక్నోపై వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.