టీమిండియా డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో 15 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో ఈ ఫీట్ చేశాడు హిట్ మ్యాన్. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, సెహ్వాగ్, అజహరుద్దీన్.. రోహిత్ కన్నా ముందున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 వేల పరుగులు సాధించిన 39వ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఇక, వేగంగా 15 వేల పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. 333 ఇన్నింగ్స్‌లో కోహ్లీ, 356 ఇన్నింగ్స్‌లో సచిన్, 368 ఇన్నింగ్స్‌లో రాహుల్ ద్రవిడ్, 371 ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉండగా హిట్‌మ్యాన్ మాత్రం 397 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ చేశాడు. నాలుగో టెస్టు రెండో రోజు ఇంగ్లాడ్‌ను 290 పరుగులకు ఆలౌట్ చేసింది టీమిండియా. రెండో రోజు ఆట ముగిసే సరికి రోహిత్ శర్మ(20), కేఎల్ రాహుల్(22) బ్యాటింగ్ చేస్తున్నారు. ఓవల్ టెస్టులో ఉమేష్ యాదవ్ 150 వికెట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.