అంతర్జాతీయ క్రికెట్‌లో తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకున్న క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్‌లో మహిళా క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. కానీ.. అయితే పురుషుల క్రికెట్‌లో మాత్రం ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్ ఒక్కడే తాను గే అని ప్రకటించాడు. తాజాగా కివీస్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ తాను గేనంటూ సంచలన ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్నాళ్లు రహస్యంగా దాచిన ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.
తాను స్వలింగ సంపర్కుడినని, ఆ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసుని తెలిపాడు. ఈ విషయం గురించి ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తాను కుమిలిపోయినట్లు డెవిస్ పేర్కొన్నాడు. అయితే ఇక దాచాల్సిన అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. డెవిస్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఈ విషయం గురించి దాచిపెడుతున్నాననే భావన నన్ను వెంటాడేది. నిజానికి ఈ విషయం నా వ్యక్తిగతం.
అయినా దీన్ని సీక్రేట్‌గా ఉంచాలని అనిపించలేదు. ప్రపంచానికి కూడా చెప్పాలనుకున్నా. నేను గే. ఆక్లాండ్‌లో జట్టులోని ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు.. అయినా వాళ్లు నన్ను నాలా ఉండనిస్తారు. నా స్వేచ్ఛకు భంగం కలిగించరు. అసలు దీనిని వాళ్లు ఒక సమస్యగా భావించలేదు..’ అని డెవిస్ వెల్లడించాడు. 1994-97 మధ్య హీత్ న్యూజిలాండ్ తరఫున 5 టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. టెస్టులలో 17, వన్డేలలో 11 వికెట్లు పడగొట్టాడు. కానీ గాయాలు, నిలకడలేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అందులో ఆసీస్ క్రికెటర్ అలెక్స్ బ్లాక్వెల్, ఇంగ్లాండ్‌కు చెందిన లిన్సే అక్క్యూ, న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్త్వైట్-లియా టహుహు, సౌతాఫ్రికాకు చెందిన డేన్ వాన్ నీకెర్క్-మరిజెన్ కాప్, మేఘనా షట్-జెస్ హోల్యాల్క్ (ఆసీస్), ఇంగ్లాండ్‌కు చెందిన నటాలీ సీవర్-కాథరీన్ బ్రంట్‌లు అనే మహిళా క్రికెటర్లు తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించడమే కాక పెళ్లి కూడా చేసుకున్నారు. మరి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ తానని తాను గేగా ప్రకటించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Heath Davis becomes first male New Zealand cricketer to come out as gay https://t.co/ipVjS7l1ef
— The Guardian (@guardian) August 2, 2022