ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న సమస్య గుండెపోటు. ఎప్పుడు ఏ క్షణాన వస్తుందో తెలియదు. అయితే గుండెపోటుకు చెక్ పెట్టే మాత్రను కనిపెట్టారు. ఈ మాత్ర వేసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఉండదని చెబుతున్నారు.
ప్రస్తుతం చాలా మంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. గుండెపోటు రావడానికి ప్రధాన కారణం గుండె ఫెయిల్ అవ్వడమే. గుండె ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఒకే ఒక్క మాత్ర ఉందని, అది అద్భుతంగా పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ మాత్ర పేరు ఏఎఫ్-130. ఈ ఏఎఫ్-130 అనే మందు ద్వారా గుండె వైఫల్యానికి చెక్ పెడుతుందని, జీవిత కాలాన్ని తగ్గించే అతి నిద్రలేమి సమస్యను (స్లీప్ ఆప్నియా) తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. గుండె వైఫల్యాలను నయం చేసే కొత్త ఔషధాన్ని ఆక్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.
గుండెకు బ్లడ్ పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆయుష్షును తగ్గించే అతిలేమి నిద్ర సమస్యను నిరోధించడంలో ఈ ఏఎఫ్-130 అనే మాత్ర అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. జంతువులపై జరిపిన ప్రయోగాలు సానుకూల ఫలితాలు చూపించాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన వైపాప టౌమాట రావు వెల్లడించారు. ఈ ఔషధం హార్ట్ ఫెయిల్యూర్ కి ప్రయోజనం చేకూరుస్తుందని, ఒక మాత్ర ధరకు రెండు లభ్యమవుతాయని అన్నారు. ఒక మనిషికి గుండెపోటు ఉండడం, ఆ తర్వాత గుండె ఆగిపోవడం జరిగితే గుండెకు రక్తాన్ని పంపింగ్ ప్రక్రియ వంటి ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ ను ఉత్తేజపరిచేందుకు సింపథెటిక్ సిస్టమ్ చేత మెదడు యాక్టివేట్ చేయబడుతుంది.
అయినప్పటికీ అవసరం లేకపోయినా మెదడు నాదీ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి కొనసాగుతోంది. చాలా మంది గుండె వైఫల్యం చెందిందని నిర్ధారణ అయిన 5 ఏళ్లకే చనిపోతున్నారు. గుండెకు నాడీ ప్రేరణలు పంపించడమే మెదడు యొక్క పని. అలానే శ్వాస క్రియను కంట్రోల్ చేస్తుంది. ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్ ను తగ్గించడం, అతిలేమి నిద్ర సమస్యను నిరోధించేందుకు శ్వాసను ఉత్తేజపరుస్తుంది. ఈ పరిశోధనలు నిజంగా పని చేయగల శక్తి కలిగి ఉందని, న్యూజిలాండ్ లో ఉన్న 2 లక్షల మంది గుండె జబ్బులున్న వారికి మంచి ఫలితాలు ఇస్తాయని.. జీవిత కాల అంచనాను మెరుగుపరుస్తాయని ప్రొఫెసర్ పటాన్ వెల్లడించారు.
ఈ ఏఎఫ్-130 ఔషధం త్వరలోనే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదం పొందబోతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ఈ మాత్ర మనుషులపై ట్రయల్స్ వేసేందుకు మార్గం సుగమం చేస్తుందని ప్రొఫెసర్ పఠాన్ అన్నారు. ఇటీవల దశాబ్దా కాలాల్లో గుండె వైఫల్యం యొక్క రోగ నిరూపణకు మెరుగుపరిచే అనేక రకాల మందులు ఉన్నాయని, అయితే ఈ మందులేవీ కూడా ఏఎఫ్-130లా సమర్ధవంతంగా పని చేయవని కార్డియాలజీ కన్సల్టెంట్, అసిసోయేట్ ప్రొఫెసర్ మార్టిన్ స్టైల్స్ అన్నారు. మరి గుండె వైఫల్యానికి చెక్ పెట్టే ఏఎఫ్-130 మాత్రపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.