న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ హెన్రీ నిన్న చెలరేగి పాక్ మీద హ్యాట్రిక్ సాధించాడు. కానీ కివీస్ జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు. అసలేం జరిగిందంటే ?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన ఐపీఎల్ హడావుడే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర క్రికెట్ మ్యాచ్ ల మీద ఆసక్తి చూపించేవారు కరువయ్యారు. ఓ వైపు ప్రధాన క్రికెట్ దేశాలన్నీ ఐపీఎల్ లో సందడి చేస్తుంటే .. మరోవైపు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు టీ 20 సిరీస్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించే వారు తక్కువే అయినా..ఆసక్తికరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో కివీస్ పేసర్ హెన్రీ హ్యాట్రిక్ తో చెలరేగాడు. ఈ ఫాస్ట్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడం మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. దీంతో హెన్రీఒక అరుదైన రికార్డ్ ని హెన్రీ తన పేరున లిఖించుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటి ? ఎవరి వికెట్లు తీసాడో ఇప్పుడు చూద్దాం.
క్రికెట్లో హ్యాట్రిక్ గురించి బౌలర్లు పెద్దగా ఆలోచించరు. ఎందుకంటే వరుసగా మూడు వికెట్లు తీయడమనేది దాదాపు అసాధ్యం. చాలా అరుదుగా మాత్రమే హ్యాట్రిక్ నమోదవ్వడం మనం చూస్తూ ఉంటాము. అలాంటి అరుదైన సంఘటనే పాకిస్థాన్-న్యూజిలాండ్ మొదటి టీ 20 సందర్భంగా జరిగింది. ఆతిధ్య పాకిస్థాన్ జట్టు మీద హెన్రీ హ్యాట్రిక్ తీసి సత్తా చాటాడు. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో హెన్రీ వరుసగా షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్, షాహీన్ ఆఫ్రిది వికెట్లను తీసి న్యూజీలాండ్ తరపున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్ గా నిలిచాడు. ఇంతకు ముందే ఓరం, సౌథీ, బ్రేస్ వెల్ హ్యటిక్ సాధించారు. అయితే పాకిస్థాన్ మీద హ్యాట్రిక్ సాధించిన రెండో కివీస్ బౌలర్ గా అదేవిధంగా పాకిస్థాన్ లో హ్యాట్రిక్ తీసిన తొలి కివీస్ బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. 13 వ ఓవర్ చివరి రెండు బంతిలకి వికెట్ తీసిన హెన్రీ 19 ఓవర్ తొలి బంతికి షాహీన్ ఆఫ్రిదిని అవుట్ చేసాడు.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో హెన్రీ హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 182 పరుగులకే ఆలౌటైంది. ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్ చెరో 47 పరుగులు చేసి రాణించారు. కివీస్ బౌలర్లలో హెన్రీ కి 3 వికెట్లు దక్కగా.. లిస్టర్,మిల్నే రెండు వికెట్లు తీశారు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ పూర్తిగా చేత్తులెత్తేసింది. కనీసం 100 పరుగులైనా చేయకుండా దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది. 94 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో చాప్ మన్ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ స్పీడ్ స్టర్ హారిస్ రౌఫ్ 4 వికెట్లతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి హెన్రీ హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ కి మాత్రం విజయం దక్కలేదు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.