టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ లీకేజీ వ్యవహారం దేశం దాటి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీమ్ తాజాగా ఈ విషయాన్ని గుర్తించింది.
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అలానే సిట్ దర్యాప్తులు అనేక సంచలన విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో గ్రూప్-1తో సహా పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పేపర్ లీకేజ్ జరిగిందనే కోణంలో సిట్ దర్యాప్తు చేపట్టింది. ఈ లీకేజీ వ్యవహారం దేశం దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సిట్ తాజాగా గుర్తించింది.
టీఎస్పీఎస్సీలో జరిగిన క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. రేణుకు, ప్రవీణ్, రాజశేఖర్ తో సహా పలువురిని ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా పోలీసులు అరెస్టు చేశారు. అలానే ఇప్పటికే వీరందరిని విచారించిన పోలీసులు పలు విషయాలను తెలుసుకున్నారు. అలానే టీఎస్పీఎస్సీ నిర్వహించే పలు పోటీ పరీక్ష పేపర్లు కూడా లీకైనట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ఈక్రమంలోనే గ్రూప్-1తో సహా పలు పరీక్షలను బోర్డు రద్దు చేసింది.
అలానే ఈ లీకేజీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ ను సిట్ విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన బావ ప్రశాంత్ తో గ్రూప్-1 పేపర్ ను షేర్ చేసినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. వీ6 వెలుగు కథనం మేరకు… రాజశేఖర్.. తన బావ ప్రశాంత్ కి పేపర్ షేర్ చేయడంతో, అతడికి కూడా సిట్ నోటీసులు పంపించింది. అయితే అతడు ఇప్పటికే పరీక్ష రాసి దేశం దాటి వెళ్లిపోయాడు. దీంతో మెయిల్, వాట్సాప్ ద్వారా సిట్ అధికారులు నోటీసులు పంపించారు.
కానీ అతడు వాడికి ఇంతవరకు స్పందించలేదు. అలానే ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాగా రాజశేఖర్ గ్రూప్-1 పేపర్ ను ప్రశాంత్ కి పంపించడంతో ఆయన న్యూజిలాండ్ లోనే ఉండి ప్రిపేర్ అయ్యాడని తెలుస్తోంది. పరీక్ష సమయానికి తెలంగాణకు వచ్చి వెళ్లాడు. అయితే అతడి ద్వారా మరికొంతమందికి పేపర్ వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారందరినీ మరోసారి సిట్ తన కస్టడీలోకి తీసుకోనుంది.
వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టనుంది. ఈ కేసు వ్యవహారంలో నిందితులైన ప్రవీణ్, రాజేశఖర్ ,ధాక్యా నాయక్, రాజేశ్వర్ అలాగే మరికొందరిని ఆరు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. చూడాలి..మరీ.. ఈ పేపర్ల లీకేజీ వ్యవహారంలో మరేన్ని విస్తుతపోయే విషయాలు వెలుగులోకి వస్తాయో. మరి.. గ్రూప్-1 పేపర్ దేశం దాటి వెళ్లినట్లు వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.