గత కొంత కాలంగా టీమిండియా ప్రదర్శనపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. కీలకమైన ఆటగాళ్లందరు వరుసగా విఫలం అవుతున్న నేపధ్యంలో.. టీమ్ సెలెక్షన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు క్రీడా దిగ్గజాలు, సగటు క్రీడాభిమానులు. టీమ్ సెలెక్షన్ సరిగ్గా లేకనే భారత జట్టు వరుసగా వైఫల్యం చెందుతూ వస్తుంది అన్నది అందరి వాదన. దాంతో టీమిండియా సెలెక్షన్ కమిటీని తొలగించింది బీసీసీఐ. వారి స్థానంలో కొత్తవారి కోసం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే టీమ్ సెలెక్షన్ పై జట్టు కెప్టెన్ ప్రభావం కూడా ఉంటుంది అన్నది కాదనలేని వాస్తవం. ప్రస్తుతం ఇదే విషయంపై రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్నాయి. రెగ్యూలర్ కీపర్ అయిన శాంసన్, ఇషాన్ కిషన్ లు ఉండగా.. రాహుల్ తో కీపింగ్ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ సెలెక్షన్ పై మండిపడుతున్నారు. రాహుల్ తోని కీపింగ్ ఎందుకు చేయిస్తున్నారు? పంత్ కు నిజంగా గాయం అయ్యిందా.. కావాలనే తీసేశారా? రెగ్యూలర్ కీపర్ శాంసన్ ను ఎందుకు తీసుకోవట్లేదు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లేదు.
‘గాయం కారణంగానే రిషబ్ పంత్ బంగ్లా సిరీస్ కు దూరం అయ్యాడు’ సిరీస్ కు ముందు రోహిత్ శర్మ వెల్లడించిన విషయం ఇది. అయితే అతడి స్థానంలో రెగ్యూలర్ కీపింగ్ చేసే సంజూ శాంసన్ ను తీసుకోవచ్చు కదా అన్నది సగటు క్రీడాభిమాని ప్రశ్న. ఇప్పుడు రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలే టీమిండియా పరాజయాలకు ప్రధాన కారణం అంటున్నారు క్రీడా నిపుణులు. కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఇదీ నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో మెహది హసన్ క్యాచ్ విడిచి టీమిండియా ఓటమికి కారణం అయ్యాడు కేఎల్ రాహుల్. అయితే కేఎల్ రాహుల్ రెగ్యూలర్ కీపర్ కాదు. అందుకే క్యాచ్ సరిగ్గా పట్టలేదని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
ఇక గత కొన్ని నెలల నుంచి రాహుల్ కీపింగ్ చేసిన దాఖలాలే కనిపించడం లేదు. అలాంటిది బంగ్లా తో మ్యాచ్ లో రాహుల్ కి కీపింగ్ బాధ్యలు అప్పగించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రెగ్యూలర్ కీపర్ల బాడీ లాగ్వేజ్ కు అప్పుడప్పుడు చేసే కీపర్లకు చాలా తేడా ఉంటుంది. అదీకాక వారు క్యాచ్ లు జారవిడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అంటారు ”టేక్ ది క్యాచ్ విన్ ది మ్యాచ్”అని. మరి అలాంటిది రోహిత్ శర్మ శాంసన్ ను కాదని రాహుల్ కు కీపింగ్ బాధ్యతలను ఎలా అప్పగించాడా? అన్నదే అసలైన ప్రశ్న. అయితే పంత్ ఈ సిరీస్ కు దూరం అయినప్పటికీ స్కాడ్ లో ఉన్న మరో కీపర్ ఇషాన్ కిషన్ కు స్థానం దక్కుతుందని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో బంగ్లాతో మ్యాచ్ లో భారీ మూల్యమే చెల్లించుకుంది టీమిండియా.
ఈ క్రమంలోనే కీపింగ్ అనుభం లేని రాహుల్.. బంగ్లా బ్యాటర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను జారవిడిచి భారత్ ఓటమికి కారణం అయ్యాడు. కానీ ఈ ఓటమికి పరోక్షంగా రోహిత్ శర్మ కూడా కారణమే అంటున్నారు అభిమానులు. ఇక ఇదే విషయాన్ని ట్విట్ చేశాడు ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే.”టీమిండియాలో అవకాశాల కోసం వికెట్ కీపర్లు ఎదురు చూస్తున్న క్రమంలో రాహుల్ తో కీపింగ్ చేయించడం ఏంటి? శాంసన్, ఇషాన్ కిషన్ లు ఉన్నారు కదా? నాకు ఇదంతా తికమకగా ఉంది” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఏదిఏమైనప్పటికీ అటు బీసీసీఐ గానీజ.. ఇటు రోహిత్ శర్మ గానీ తీసుకునే నిర్ణయాలు జట్టును ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి అన్నది కాదనలేని వాస్తవం అని మాజీ దిగ్గజాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
What are your thoughts? 🤔#crickettwitter #indvsban pic.twitter.com/lX4ZEn9OQY
— Sportskeeda (@Sportskeeda) December 4, 2022
From 136/9 to 187/9, Mehidy Hasan Miraz guides Bangladesh home with a fighting 38(39).#BANvIND pic.twitter.com/Kz67DO6Ev1
— CricTracker (@Cricketracker) December 4, 2022