ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేపై దాడి, కిడ్నాప్ చేశారన్న వార్త గత 24 గంటలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ అభిమానులంతా హర్షా భోగ్లేకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ చానెల్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న హర్షా భోగ్లే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి ఎంఎస్ ధోని తప్పుకోవడంపై ఇన్‌స్టా లైవ్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అకస్మాత్తుగా స్క్రీన్‌పై కనిపించకుండా పోయాడు.
వీడియోలో.. “క్యా హువా? కౌన్ హై? కహా సే ఆ గయే?” అని హర్షా భోగ్లే అరవడం వినిపించింది. అతనిపై ఎవరో దాడి చేసినట్టు అరుపులు, కేకలు వినిపించడంతో అందరూ ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఆ చానెల్ హోస్ట్ సైతం హర్షాపై ఎవరో దాడి చేసినట్లున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా టెన్షన్ పడ్డారు.
దీనికి మరింత హైప్ పెంచుతూ క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్.. ‘హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరిగిందో మాకు తెలియదు. తెలుసుకునేందుకు హర్షా భోగ్లే టీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం’అంటూ ట్వీట్ చేసి అభిమానుల ఆందోళనను రెట్టింపు చేసింది. కట్ చేస్తే.. అసలు హర్షా భోగ్లేపై దాడి జరిగిందన్నది వాస్తవం కాదని, సదరు ప్రోగ్రామ్‌కి హైప్ తెచ్చేందుకు ఆ ఛానెల్ వాళ్లు ప్లే చేసిన చీప్ ట్రిక్ అని తేలింది.
Not confirmed! @bhogleharsha potentially kidnapped.
Source: from telegram pic.twitter.com/IkCWikEod4— Darshana K (@_TheKande) March 24, 2022
తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన హర్షా భోగ్లే అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ‘నేను క్షేమంగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందకండి. వాస్తవానికి నాపై ఎలాంటి దాడి జరగలేదు. సదరు వీడియోలో మేమనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు. ఏదిఏమైనప్పటికీ అందరిని క్షమాపణలు కోరుతున్నాను, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్ అంటూ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు.
I am fine. Sorry to have got a lot of you worried. Thank you for the love and concern. It became more viral than I anticipated. That too is a learning. It was meant to lead to something else. Sorry. And cheers.
— Harsha Bhogle (@bhogleharsha) March 24, 2022
You learn something new everyday. It seemed a lighthearted thing to do but in its execution, it became something that I didn’t think it would. I am actually a bit embarrassed now. https://t.co/OwFrwb6vm9
— Harsha Bhogle (@bhogleharsha) March 24, 2022
హర్షా భోగ్లే 1961లో హైదరాబాద్‌లో సెటిలైన ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య, ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హర్షా భోగ్లే తెలుగులో సైతం అనర్గళంగా మాట్లాడగలడు. గత సీజన్ ఐపీఎల్ సందర్భంగా దినేశ్ కార్తీక్‌ను తెలుగులో ఇంటర్వ్యూ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు.