దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. నాలుగేళ్ళ పిల్లాడి నుంచి నలభై ఏళ్ల పెద్ద వాళ్ల వరకు అందరకి క్రికెట్ ఆడాలనే కుతూహలమే. కొందరైతే.. దేశానికి ఆడాలని కలలు కంటుంటారు. కానీ, దేశానికి ఆడడమంటే అంత సులువైన పనికాదు. 150 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో.. క్రికెట్ ఆడే వారు సంఖ్య కూడా లక్షలపైనే ఉంటుంది. అందరిని కాదని అదృష్టం మనల్ని వరించాలంటే ఎంత గొప్పగా రాణించాలో. కానీ, ఒకసారి క్రికెట్ లో గొప్పగా రాణించారంటే.. అది దేశవాళీ క్రికెట్ అయినా, జాతీయ జట్టుకైనా.. జీవితంలో స్థిరపడడానికి బోలెడు అవకాశాలు ఉంటాయి. స్పోర్ట్స్ కేటగిరీలో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చు. అలా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే దురాశతో ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఒక క్రికెటర్ కటకటాల పాలయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ ఘడ్ రంజీ కెప్టెన్ హర్ప్రీత్ సింగ్ భాటియా నకిలీ ధృవపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారిస్తున్నారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన అతడు.. ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఆడిటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014 రంజీ సీజన్ లో భాటియా ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన మార్కుల మెమో, ఇతర ధృవపత్రాలను సమర్పించాడు. బుందేల్ఖండ్ యూనివర్సిటీలో బీకామ్ డిగ్రీకి సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు.
ఇది కూడా చదవండి: MS Dhoni: IPL తర్వాత సినిమాల్లోకి ధోని! హీరోయిన్‌గా నయనతార
అయితే ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్ఖండ్ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది. భాటియా యూనివర్సిటీలో చదవలేదని తేలింది. దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతున్నదని రాంచీలోని విధాన సభ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక నకిలీ పత్రాలు సమర్పించినందుకు కటకటాల పలు అవ్వాల్సి ఉంటుంది.
Chhattisgarh Police have registered a case against forgery case against the state’s Ranji Trophy team captain Harpreet Singh Bhatia, accusing him of using a fake graduation certificate to seek a government job in 2014.https://t.co/MpU2WIjRAI
— Hindustan Times (@htTweets) May 12, 2022
భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్ లో, 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించకపోవడంతో కనుమరుగయ్యాడు. ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్గడ్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.
Disappointed by IPL franchises for not picking 30 year old Harpreet Singh Bhatia (MP). One of the best Domestic Indian Batsman. Thought since ipl was getting bigger with 2 more teams, he would have got chance. pic.twitter.com/pErJfEwDEy
— Ritik (@Ritik_Agarwalll) March 1, 2022