దక్షిణాఫ్రికా మాజీ హిట్టర్ హర్షల్ గిబ్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.. మైదానంలో దిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. తన చేష్టలతో ఎప్పుడూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటాడు.
విభిన్న చర్యలతో నిత్యం చర్చల్లో ఉండే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మరోసారి వార్తల్లోకెక్కాడు. 49 ఏండ్ల వయసులో తన నెచ్చెలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆమె ఎవరో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్ లో తన విధ్వంసక విన్యాసాలతో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న దక్షిణాఫ్రికా మాజీ హిట్టర్ హర్షల్ గిబ్స్.. స్టేడియం బయట తన చర్యలతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటాడు. గతంలోనే వివాహం చేసుకున్న గిబ్స్ అనేక వివాదాల్లోనూ తలదూర్చిన విషయం తెలిసిందే. మద్యం సేవించడం నుంచి మొదలుకొని ఫిక్సింగ్ ఆరోపణల వరకు ప్రతి దాంట్లో తలదూర్చిన గిబ్స్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న గిబ్స్.. తన సన్నిహితురాలు డానా నెమెత్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. గత నెలలోనే వీరిద్దరూ రింగ్ లు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్న గిబ్స్.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 90 టెస్టులు, 248 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 6167 పరుగులు చేసిన గిబ్స్.. వన్డేల్లో 8094 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 23 టీ20ల్లో 400 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 35 సెంచరీలు చేసిన గిబ్స్.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కోచ్ అవతారమెత్తాడు. వివిధ దేశాల్లో జరిగే లీగ్ ల్లో పలు జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలోనే 49 ఏళ్ల వయసులో తన జీవితంలో కొత్త దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాడు. డానా నెమెత్ తో నిశ్చితార్థం చేసుకున్న గిబ్స్.. దీనికి సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ తో తళుక్కుమంటున్న డానా నెమెత్ ను గిబ్స్ ముద్దాడుతున్న ఫొటో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు గిబ్స్ కు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెల రోజుల క్రితమే తాను పెళ్లికి అంగీకరించినట్లు నెమెత్ వెల్లడించింది. మరి గిబ్స్ లేటు వయసులో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.