క్రికెట్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ టీమిండియా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పేరు సుపరిచితమే. కుడిచేతి వాటం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు టీమిండియా గెలుపు కోసం పలుమార్లు కీలక భూమిక పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్ - 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
టీమ్ ఇండియాలో తనదైన బ్యాటింగ్ స్టైల్ తో కోట్ల మంది అభిమానం సంపాదించిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టీమిండియాలో తెలుగువాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. టీమిండియా గెలుపులో పలుమార్లు కీలక భూమిక పోషించాడు అంబటి. ప్రస్తుతం ఐపీఎల్ -2023 లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంబటి రాయుడు. ఐపీఎల్ సీజన్ పూర్తి కాగానే.. ఏపీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
టీమిండియాలో తన బ్యాటింగ్ తో ఎన్నో వండర్స్ సృష్టించాడు తెలుగు కుర్రాడు అంబటి రాయుడు. ప్రస్తుతం ఐపీఎల్ – 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంబటి రాయుడు. ఈ టోర్నీ పూర్తయిన తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అంబటి రాయుడు స్పందించారు. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ఎంట్రీ పై పలు కీలక విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉందని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు ఎంతో మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి చదువుకున్న యువత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ప్రజా సేవలో ఉండాలనే బలమైన కోరిక తనను రాజకీయాల వైపు ప్రేరేపిస్తుందని అంబటి చెప్పారు.
చిన్నప్పటి నుంచి బాగా చదివి సివిల్ సర్వీసెస్ తో ప్రజలకు సేవ చేయాలని భావించినప్పటికీ.. క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ కల నెరవేర్చుకోలేకపోయాను… అయితే రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు చేసే అవకాశం లభిస్తుందని.. అందుకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంబటి రాయుడు పుట్టింది గుంటూరు జిల్లా.. పెరిగింది మాత్రం హైదరాబాద్. అందుకే అంబటి ఏపీ రాజకీయాపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అంబటి రాజకీయాలపై ఆసక్తి ఉందని తెలిసి ఏపీలో పలు పార్టీలు ఆయనకు ఆహ్వానాలు పలికినట్లు సమాచారం. తగిన సమయంలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సదరు పార్టీ నేతలతో అంబటి రాయుడు అన్నట్లు తెలుస్తుంది. అయితే అంబటి రాయుడు ఏ పార్టీలో చేరబోతున్నాడన్న విషయం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. అంబటి అధికార పార్టీ వైసీపీలోకి వెళ్తారా? లేదా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలోకి వెళ్తారా? ఆయన ఏ పార్టీ నుంచి అరంగ్రేటం చేస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అంబటి ఇప్పటి వరకు ఐపీఎల్ లో 190 పైగా మ్యాచ్ లు ఆడారు.