సామాన్యులను, ఉద్యోగులను, వ్యాపారస్థులను కూడా మోసం చేసిన వాళ్లను చూశాం కానీ ఏకంగా సీఎంకే టోకరా కొట్టాడో క్రికెటర్ ముసుగులో ఉన్న కేటుగాడు. తాను క్రికెటర్ అని, ఏకంగా భారత కెప్టెన్ అని చెప్పుకుని, దేశం తరుపున ఆడి కప్ గెలిచినట్లు సీఎంకే కలరింగ్ ఇచ్చాడు. తీరా చూస్తే..
మోసం చేయడంలో ఆరితేరీపోతున్నారు కేటుగాళ్లు. సామాన్యులకు మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించే మోసగాళ్లు కొందరైతే.. తమ పబ్బం గడుపుకోవడం కోసం అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు మరి కొంత మంది. సామాన్యులను, ఉద్యోగులను, వ్యాపారస్థులను కూడా మోసం చేసిన వాళ్లను చూశాం కానీ ఏకంగా సీఎంకే టోకరా కొట్టాడో క్రికెటర్ ముసుగులో ఉన్న కేటుగాడు. తాను క్రికెటర్ అని, ఏకంగా భారత కెప్టెన్ అని చెప్పుకుని, దేశం తరుపున ఆడి కప్ గెలిచినట్లు సీఎంకే కలరింగ్ ఇచ్చాడు. నిజమేనని నమ్మిన సీఎం, మంత్రులు అతడిని సన్మానించారు. భారీ స్థాయిలో ఆర్థిక సాయం కూడా చేశారు. తీరా అతడి బండారం బయట పడి జైలు పాలయ్యాడు.
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను బురిడీ కొట్టించిన వినోద్ కుమార్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని రామనాథపురం ఎగువ సెల్వనూరు చెందిన దివ్యాంగుడు వినోద్ కుమార్.. లండన్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ తరుపున ఆడినట్లు తెలిపాడు. వీల్ చైర్ క్రికెట్‌కు సారథ్యం వహిస్తూ పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన ఆసియా కప్ ఆడి గెలిచానంటూ మాయ మాటలు చెప్పాడు. ట్రోఫీని, పలు అవార్డులకు సంబంధించినవి చూపించడంతో నిజమేనని నమ్మిన సీఎం, ఇతర మంత్రులు అతడికి అభినందనలు తెలిపారు. ఆర్థిక సాయం కూడా అందించారు.
ఈ ఏడాది మొదట్లో జిల్లా కలెక్టర్‌ను కలిసిన వినోద్‌బాబు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్థించారు. మంత్రి రాజకన్నప్పన్ నియోజకవర్గానికి చెందిన వినోద్‌బాబు.. మంత్రిని కలుసుకుని విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీంతో ఆర్థిక సాయం కూడా పొందాడు. ఈ విషయంపై కొందరు క్రీడాకారులు ఫిర్యాదునివ్వడంతో ఖంగుతిన్నారు మంత్రులు. వెంటనే రంగలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పుడు సంచలన నిజాలను గుర్తించారు పోలీసులు. వినోద్ కుమార్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది. కలకత్తాలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆడి, అక్కడే ఒక కప్పు కొనుక్కుని.. లండన్ మ్యాచ్ అంటూ కలరింగ్ ఇచ్చినట్లు గుర్తించారు. చివరకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు.