ఒక కుటుంబం నుండి ఒకరు క్రికెట్ జట్టు చోటు సంపాదించడం అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది ఒకే కుటుంబం నుండి అన్నదమ్ములు ఇద్దరూ దేశవాళి లో తన సత్తా చాటి జాతీయ జట్టులో చోటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అన్నీ క్రీడలలో చాలా మంది అన్నదమ్ములు జంటగా ఆడటం చూస్తూనే ఉన్నాం. అలాగే క్రికెట్ చరిత్రలో కూడా చాలా మంది అన్నదమ్ములు వివిధ దేశాల తరపున కలిసి ఆడి ప్రేక్షకులను అలరించారు. మనదేశం నుంచి పఠాన్ బ్రదర్స్, పాండ్యా బ్రదర్స్ కూడా ఉన్నారు.
కెరీర్ ప్రారంభం నుంచి హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఒకే చోటు ఆడినారు. ఇటీవల ఐపీఎల్ పుణ్యామా అని వేర్వేరు జట్లకి వెళ్లారు. హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టుకి సారథ్యం వహిస్తుంటే. లక్నో తరపున కృనాల్ ఆడుతున్నాడు. ఈ సీజన్ ఇరుజట్లు ఒకసారి తలపడగా అందులో గుజరాత్ విజయం సాధించింది. మళ్లీ మంగళవారం మరోసారి ఈరెండు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కి ముందు కృనాల పాండ్యా తన సోదరుడి కొడుకు అగస్త్యతో దిగిన ఫోటో ట్వీట్ చేశాడు. అంతే కాకుండా” చూశావా మై లక్కీ ఛార్మ్ మాతోనే ఉన్నడంటూ” పోస్ట్ పెట్టాడు. హర్ధిక్ కుమారుడు అగస్త్య లక్నో జెర్నీలో ఎంతో క్యూట్ గా కనిపించాడు. ఈ ట్వీట్ మంచిఅనుబంధాలకు అద్దం పడుతుందని కొందరు కామెంట్స్ చేశారు.
గతంలో రంజీ మ్యాచ్‌ల్లో బరోడా తరఫున ఆడిన హార్ధిక్, కృనాల్.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భారత జట్టుకు కూడా ఆడారు. చాలా కాలంపాటు కలిసే కొనసాగిన పాండ్యా బ్రదర్స్ ఐపీఎల్ 2022లో వేర్వేరు జట్లలో స్థిరపడ్డారు. కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్ హార్ధిక్‌ను కెప్టెన్‌గా తీసుకుంటే.. ఇంకో నూతన జట్టు లక్నో కృనాల్‌ని సొంతం చేసుకుంది. ఈక్రమంలో కృనాల్ పాండ్యా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Got my lucky charm on my side for tomorrow’s game @hardikpandya7 😉 pic.twitter.com/OiDfEMHeHJ
— Krunal Pandya (@krunalpandya24) May 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.